టీ కాంగ్రెస్ లో రేవంత్ ఒంటరి
హైద్రాబాద్, సెప్టెంబర్ 20
తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ ను ఒంటరి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా..రేవంత్ టార్గెట్ గా నేతల మాటల తూటాలు పేల్చుతున్నారా.రేవంత్ రెడ్డి ఆదిపత్యాన్ని సీనియర్లు సహించట్లేదా...
రేవంత్ రెడ్డి ని జిల్లా కే పరిమితం చేయాలని పీసీసీ రేసులో ఉన్న నేతలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారా
తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఓంటరి అయ్యాడ..లేక కావాలనే రేవంత్ రెడ్డి ని మిగతా నేతలు ఓంటరి చేసారా అనే చర్చ పార్టీ లో జోరుగా సాగుతోంది.. కొద్ది రోజులుగా పార్టీ లో జరుగుతున్న వ్యవహారాలు చూస్తే పార్టీ లో ఆధిపత్య పోరు స్పష్టం గా కనబడుతోంది.ఇది హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయం లో నేతల మధ్య ఆదిపత్య పోరు బయటపుతుంది...హుజూర్ నగర్ లో ఉత్తమ్ పద్మావతి ని ప్రకటించడం పట్ల తీవ్ర వ్యతిరేకత ను వ్యక్తం చేసారు రేవంత్ రెడ్డి..ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యర్థి ప్రకటించడం పట్ల రేవంత్ రెడ్డి కుంతియా కు ఫిర్యాదు చేశారు.ఉత్తమ్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని రేవంత్ డిమాండ్ చేయడం తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా చాలా మంది నేతలు రేవంత్ పేరు ను ప్రస్తావించకుండా విమర్శలు చేసారు.ఇప్పటికే రేవంత్ రెడ్డి పై ఏఐసీసీ కి పీసీసీ నేతలు కొందరు ఫిర్యాదు చేసారని సమాచారం... రేవంత్ రెడ్డి కి పీసీసీ దక్కకుండా ఉండేందుకు అన్ని రకాల ఫిర్యాదు లు చేస్తున్నారట పార్టీ నేతలు..కొన్ని రోజుల క్రితం సోనియాగాంధీ ని రేవంత్ కుటుంబ సభ్యులతో కలిసి చాలా సేపు చర్చించుకోవడం జరిగింది. ఇక రేవంత్ కు పీసీసీ ఫైనల్ అయ్యింది మరుసటి రోజే ప్రకటన వస్తుంది అని అందరూ అనుకున్నారు, కానీ ఢీల్లీలో జరిగిన పరిణామాలతో అది కాస్తా కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. రేవంత్ సోనియాను కలిసిన వెంటనే అలర్ట్ అయిన సీనియర్లు భట్టి నేతృత్వం లో సంతకాలు పెట్టి మరి రేవంత్ కు పీసీసీ ఇవ్వొద్దు అని ఫిర్యాదు చేశారని సమాచారం..తనపై సీనియర్స్ ఫిర్యాదు చేయడంతో రేవంత్ కూడా ఎదురు దాడి మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉప్పు నిప్పు గా ఉన్న సీనియర్లు రేవంత్ ను ఒంటరిని చేయడానికి వ్యూహాత్మకంగా ఒక్కటైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మాకు పీసీసీ ఇవ్వాలి అని పట్టుబట్టి నేతలు ఇప్పుడు మలో ఎవరికైనా ఇవ్వండి రేవంత్ కు తప్ప అన్న కొత్త డిమాండ్ అధిష్టానం ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. ఒక పక్క బీజేపీ పుంజుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతుంది అని కార్యకర్తలు ఆందోళ చెందుతున్నారు. నేతల మధ్య విభేదాలు ఉంటె మాట్లాడి పరిష్కరించుకోవాలి తప్ప ఇలా బహిరంగ చర్చ వల్ల పార్టీ కి నష్టమే తప్ప లాభం లేదంటుంన్నారు కాంగ్రెస్ లో మరికొందరు నేతలు...