YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

అంగన్ వాడీల్లో ఇంగ్లీషు మీడియం

అంగన్ వాడీల్లో ఇంగ్లీషు మీడియం

అంగన్ వాడీల్లో ఇంగ్లీషు మీడియం
ఖమ్మం, సెప్టెంబర్ 20,
అంగ న్‌వాడీ కేంద్రాల్లో ఇక నుంచి ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు చెప్పాలని నిర్ణయించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్య అందించేందుకు సర్కార్ కార్యాచరణ చేస్తోంది. ఇప్పటి వరకు ప్రీ స్కూల్, పౌష్టికాహారం, ఆటాపాటలకే పరిమితమైన అంగన్‌వాడీ చిన్నారులకు ఏబీసీడీలు నేర్పించే అవకాశం వచ్చిందిజ స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి 
పునాదులు వేయాలని అంగన్‌వాడీల్లో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. దగ్గర ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను పాఠశాలల్లో విలీనం చేసి అవసరమైతే ప్రత్యేక తరగతి గదులను ఏర్పాటు చేయించే విధంగా అధికారులు కార్యాచరణ చేయాలని అన్నారు. ఆంగ్ల మాధ్యమం మోజులో తల్లిదండ్రులు మూడేళ్లు వచ్చిన తమ పిల్లల ను వేల రూపాయలు ఫీజు లు చెల్లించి ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలలో ఆంగ్ల మాధ్యమంలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది అంగన్‌వాడీ టీచర్లు చిన్నారులకు అక్షరాలను నేర్పించాలి. చాలా పాఠశాలల్లో అంగన్‌వాడీ టీచర్లు అక్షరాలు చేర్పించడం లేదనే ఆరోప ణలు ఉన్నాయి. కేవలం భోజనంతో రోజులు గడుపుతున్నారని పలు నివేది కలు స్పష్టం చేస్తున్నారు. ఈ కారణంగా అంగన్‌వాడీ కేంద్రాల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పర్యవేక్షణ పెంచేందుకు అనువుగా ఉన్న కేంద్రాలను సమీపంలోని పాఠశాలల్లోకి మారుస్తున్నారు. పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాలను సమీపంలోని కేంద్రంలోకి విలీనం చేస్తున్నారు. ఈ కారణంగా పర్యవేక్షణ కూడా పకడ్బందీగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించడంతో చిన్నారులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. మూడేళ్ళ వయస్సు నుంచే అక్షరాలు నేర్చకోనున్నారు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించి నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీల్లోని పాఠ్యాంశాలను నేర్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నా రు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు సంబంధించి ఫీజులు, దుస్తులు, పుస్తకాలు, రాత పుస్తకాలు, టై, బెల్ట్, పరీక్ష ఫీజులు తదితరాల పేరుతో 
ఏటా రూ.10 వేలకు మంచి ఖర్చు చేస్తున్నారు. ఇది ఆర్థిక భారం అయినప్పటికీ పిల్లలను బాగా చదివించాలన్న ఉద్దేశంతో భరిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆంగ్ల మాధ్యమంలో బోధన అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ప్రారంభమవుతుండటంతో తల్లిదండ్రులకు రానున్న రోజుల్ల ఆర్థిక భారం తగ్గనుంది.

Related Posts