Highlights
- మార్కెట్ నుంచి కలెక్టర్ క్యాంప్ అఫీస్ కు ర్యాలీ
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ.. బంద్ పిలుపునిచ్చిన మంగళవారం శ్రీకామాక్షి స్వర్ణకార సంఘం ర్యాలీ నిర్వహించతలపెట్టింది. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలోని స్వర్ణకారులు అంతా బంద్ చేపట్టి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలను అందచేయనున్నట్టు సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.పోతులూరి ఆచారి తెలిపారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం 10.30 గంటలకు పాతబస్తీలోని పిళ్లా అప్పారావు మార్కెట్ నుంచి కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరనున్నట్లు పేర్కొన్నారు.