హైదరాబాద్
యురేనియం తవ్వకాలు రెండు రాష్ట్రాల్లో పది జిల్లాలపై ప్రభావం చూపుతోంది. హైద్రాబాద్ ప్రజలు తాగే కృష్ణా జలాలు కలుషితమవుతాయని సిపిఐ నేత నారాయణ అన్నారు. నల్లమల ప్రాంతంలో యూరేనియం తవ్వకాలకు అనుమతించవద్దని కోరుతూ శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను సీపీఐ బృందం కోరింది. తరువాత నారాయణ మీడియాతో మాట్లాడారు. ఏడు, ఎనిమిది జిల్లాలను ప్రభావం చూపే యురేనియం తవ్వకాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశాం. కాలుష్యం నివారణపై అంతర్జాతీయ చర్చ జరుగుతుంది. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతోనే కేసీఆర్ యురేనియం తవ్వకాలపై మాట మార్చారు. యురేనియం తవ్వకాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. సర్వే కోసమే నల్లమలలో 40వేల బోర్లు వేయాల్సిన పరిస్థితి. బోర్లు వలన జంతువులు, వృక్షాలను కోల్పోయి.. పర్యావరణం దెబ్బతింటోందని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం కాదు.. అనుమతులను ఉప సంహరించుకోవాలి. కేంద్ర కలుగుజేసుకుని.. అటవీ యురేనియం తవ్వకాలు
నిలిపివేయించాలని అన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తవ్వకాలు అపుతామన్న కేసీఆర్, అనుమతులు ఉపసంహరించుకోవాలి. నల్లమలను కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో వినాశనమే. యురేనియం తవ్వకాలపై
మాపోరాటం ఉదృతం చేస్తామని అన్నారు.