హైదరాబాద్
కిడ్నీ రోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం నాడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు అయన సమాధానం ఇచ్చారు. ముఖ్య మంత్రి కేసీఆర్ డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు ఆదేశించారన్నారు. పది వేల మందికి డయాలసిస్ నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కో పేషెంట్ పై ఏడాదికి రూ.1.20లక్షల నుంచి రూ.1.50లక్షలు ఖర్చు పెడుతున్నామన్నారు. డయాలసిస్ సెంటర్లు ఇంకా పెంచుతామన్నారు. కిడ్నీ రోగులకు పెన్షన్ ఇచ్చే అంశాన్ని.. సీఎం కేసీఆర్ తో దృష్టికీ తీసుకెళతామన్నరు. ఇప్పటికే జీహెచ్ఎంసీలోని మురికివాడల పేదలకు వైద్య సేవలందించేందుకు 106 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామన్నారు. యూపీహెచ్ సీల్లో ఉండే అన్ని మందులు బస్తీ దవాఖానల్లో ఉన్నాయన్నారు. అక్కడి వైద్యులు అందుబాటులో ఉండడంతో పాటు అన్ని రకాల మందులను ఇస్తున్నామన్నరు.ప్రశ్నోత్తరాల్లో భాగంగా డయాలిసిస్పై ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత ప్రశ్న అడిగారు. ఈ నేపథ్యంలో
కిడ్నీ సంబంధిత వ్యాధితో తన తండ్రి చనిపోయాడని గుర్తుచేసుకొని సునీత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సమస్యలతో బాద పడుతున్న కుటుంబాలు ఆర్థికంగా చితికి పోయారని సభలో ఆమె తెలిపారు. తన తండ్రి కిడ్నీ పేషంట్ కావడంతో తాము ఆర్థికంగా చితికిపోయామని అన్నారు. ఆసరా పెన్షన్లు, ఎయిడ్స్ పేషెంట్స్ ఇచ్చినట్లుగానే కిడ్నీ పేషెంట్లకు పెన్షన్ ఇచ్చే విధంగా చూడాలని ఎమ్మెల్యే సునీత కోరారు.