హైదరాబాద్
పేదలకు అన్నం పెట్టే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని, పేదలకు అందాల్సిన బియ్యం అక్రమరవాణా జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శుక్రవారం నాడు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ పేదలు ఆకలితో
అలమటించకూడదనే సీఎం కేసీఆర్ రూపాయికే కిలో చొప్పున ఒక్కోక్కరికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామని తెలిపారు 2.66 కోట్ల మందికి రేషన్ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రేషన్ బియ్యం కోసమే వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు ఈ ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని అన్నారు. రేషన్ షాపుల సంఖ్యను పెంచే అంశం పరిశీలనలో ఉంది. . కొత్తగా ఏర్పడిన
పంచాయతీలలో కొత్త కార్డులు జారీ చేస్తామని అన్నారు. త్వరలోనే రేషన్షాపులను పెంచుతాం. రేషన్ డీలర్ల కమీషన్ పెంచాం. మళ్లీ పెంచుతామని సీఎం చెప్పారని మంత్రి గంగుల వెల్లడించారు.