Highlights
- టిడిపి,
- టిఆర్ఎస్,
- బిజెడిలకు
- ఆహ్వానాలు లేవు.
యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీ మంగళవారం 10 జనపథ్ లోని తమ నివాసంలో 17 ప్రతిపక్షపార్టీలతో మంగళవారం విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే 2019 ఎన్నికల్లో బిజెపిని గద్దె దించాలనేది లక్ష్యంగా ఆయా పార్టీలతో చర్చనున్నారు. ఈ విందుకు ఎపి, తెలంగాణ, ఒడిశాల్లో అధికారంలో ఉన్న టిడిపి, టిఆర్ఎస్, బిజెడిలకు ఆహ్వానాలు లేవు. కాగా వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె పార్టీలు ఈ విందుకు హాజరు కానున్నట్లు సమాచారం. బిఎస్పికి ఆహ్వానం వెళ్లినా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఆపార్టీ జెడిఎస్‌తో పొత్తు పెట్టుకున్నందున సోనియా సమావేశానికి హాజరు కాకపోవచ్చనని భావిస్తున్నారు.