సైక్లింగ్ తో ఆరోగ్యం
వనపర్తి
ప్రజల్లో సైక్లింగ్ పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా వనపర్తి జిల్లా అమరచింత కు చెందిన సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ నరేందర్ రెడ్డి శుక్రవారం నాడు హైదరాబాద్ నుండి అమరచింత వరకు సైకిల్ పై యాత్ర నిర్వహిస్తూ అందులో భాగంగా జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతిని కలిశారు.డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎవరు సైక్లింగ్, వాకింగ్, రన్నింగ్ వంటివి చేయడంలేదని, ప్రతి చిన్న దూరానికి ప్రతి ఒక్కరు మోటర్ సైకిల్లు, కార్లు వంటి వాహనాలను వాడుతున్నారని చెప్పారు అలా వాడడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. సైకిల్ వాడడం వల్ల ఆరోగ్యంతో పాటు జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్రోల్, డీజిల్ వంటివి ఆదా అవుతాయని దీనితో పర్యావరణాన్ని రక్షించవచ్చని ప్రజలకు అవగాహన కలిగించడానికే నేను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించానని, మన రాష్ట్రంలో నిర్మల్, అదిలాబాదు, వరంగల్ తదితర ప్రాంతాల్లో రైడ్ చేశానని తెలియజేస్తూ గత నెల ఫ్రాన్స్ దేశంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ లో కూడా పాల్గొన్నానని ఇందులో భాగంగానే సొంత జిల్లాకు వెళ్లి ప్రజలను చైతన్యపరచాలని ఉద్దేశంతో ఈ రోజు సైకిల్ పై హైదరాబాద్ నుంచి వనపర్తి జిల్లా కేంద్రానికి వచ్చి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ని కలవడం జరిగింది. కలెక్టర్ స్వేతా మహంతి నరేందర్ రెడ్డి ని శాలువా తో సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమంలో డీఆర్ ఒ వెంకటయ్య,పౌర సంబంధాల అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.