YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో మూడు మేజర్ పోర్టుల నిర్మాణం

ఏపీలో మూడు మేజర్ పోర్టుల నిర్మాణం

అమరావతి 
పశుసంవర్థక, మత్స్య శాఖలపై సీఎం  వైయస్.జగన్  శుక్రవారం సమీక్ష నిర్వహించారు.  శ్రీకాకుళం జిల్లామంచినీళ్లపేట సహా రాష్ట్రంలో గుర్తించిన ప్రాంతాల్లో జట్టీల నిర్మాణాలపై మాట్లాడుతూ వీటిని ప్రణాళికా బద్ధంగా పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని అన్నారు.   రాష్ట్రంలో మూడు మేజర్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.  మచిలీపట్నంను మేజర్ పోర్టుగా తీర్చిదిద్దుతామని అన్నారు.  మత్స్యకారుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకుందన్న సంకేతం పోవాలి. దీనికోసం వారు కోరుతున్న ప్రాంతాల్లో జట్టీలు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలు చేయాలి. ఈ పనుల్లో పారదర్శకత ఉండేలా చూసుకోండి. స్కాంలకు తావులేకుండా చూసుకోండని అయన అన్నారు. గుజరాత్లో 25వేల తెలుగు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయన్న అధికారులు, ఉపాధిలేక వలస వెళ్లారని  అధికారులు సీఎం కు తెలిపారు. వేటకు అవసరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా వారిని తిరిగి రాష్ట్రానికి రప్పించే అవకాశాలు ఉంటాయని అధికారులు అన్నారు. 
చేపలు, రొయ్యలు పెంచుతున్న ప్రాంతాల్లో ల్యాబ్, రైతులకు అవగాహన కల్పించడానికి వర్క్షాపుల ఏర్పాటుకు జనవరి నాటికి ఏర్పాటు చేసేలా  చర్యలు తీసుకోవాలన్న సీఎం సీడ్, ఫీడ్ల్లో కచ్చితంగా నాణ్యత ఉండాలి. ఎక్కడా కూడా కల్తీ ఉండకూడదని అన్నారు. కల్తీ చేసేవారిపై ఉక్కుపాదం మోపండి. ఎక్కడా నాకు కల్తీ అనేది కనిపించకూడదని అన్నారు. 
ఆక్వా ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లో సంబంధిత రంగానికి చెందిన వారిని ఉద్యోగులుగా తీసుకున్నారు. వారికి సరైన శిక్షణ ఇచ్చి, రైతులకు మంచి జరిగేలా చూడాల్సిన బా«ధ్యత అధికారులదేనని  సీఎం స్పష్టం చేసారు. 
తూర్పు గోదావరి .జిల్లాలో హేచరీజోన్గా ప్రకటించిన ప్రాంతంలో ఫార్మా కంపెనీలకు అనుమతి ఇచ్చారు. దీనివల్ల కాలుష్యం అంతా సముద్రంలోకి వెళ్తుంది. ఇదే ప్రాంతంగుండా నేను పాదయాత్ర చేశాను. ఒక ప్రాంతాన్ని పలానా జోన్గా ప్రకటించిన తర్వాత అక్కడ వేరే పరిశ్రమలకు అనుమతి ఇవ్వడం, కలుషితం చేయడం కరెక్టు కాదని జగన్ అన్నారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి,   ఒక విధానాన్ని రూపొందించండని అన్నారు.  ఆక్వా పంట చేతికి వచ్చే సరికి రేటు పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, ఇది మనకు పెద్ద సవాలు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు,దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలి. రైతుల ప్రయోజనాలనురక్షించాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. పశువుల వైద్యంకోసం 102 వాహనాలు, వచ్చే ఏడాది 
నుంచి తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి న పశుసంవర్ధక, మత్సశాఖ మంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమణ, ఆయా శాఖల ఉన్నతాధికారులు హజరయ్యారు.

Related Posts