మహబూబ్ నగర్ సెప్టెంబర్ 20
ఉప్పునూంతల మండల పశువైధ్యశాలలో మహబూబ్ నగర్ పశుగనాభివృధ్ధి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గోపాలమిత్రల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ వెటర్నరీ యూనివర్సిటి ఫ్రోఫేసర్ల తో పశువుల సింక్రనైజేషన్ క్రృత్రిమ గర్భోత్పత్తి గురించి గోపాలమిత్రలకు శిక్షణ కార్యక్రమం జరిపారు. పాడి పశువులకు రైతు ముంగిట్లో క్రృత్రిమ గర్భాధారణ
చేస్తున్నల గోపాలమిత్రలకు అవగాహన కల్పించారు. సకాలంలో ఎదకు రాని పశువులకు హార్మోన్ ఇంజక్సన్ ఇచ్చి వాటిని ఎదకు వచ్చే విధంగా చేసి క్రృత్రిమ గర్భధారణ చేయటం వలన రైతుకు లాబదాయకంగా ఉంటుందని అన్నారు. ఏ సీజన్లో అయినా పశువును చూడి కట్టించే సింక్రనైజేషన్ పద్దతి పై శిక్షణ ఇచ్చారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ ఫ్రొఫేసర్ అనిల్ కుమార్ రెడ్డి, సిబిఒ ఢా మదుసూధన్ గౌడ్, మండల పశువైధ్యాదికారి డా.కే. నరెందర్, డా దీప్తి , గోపాలమిత్ర సూపర్వైజర్ మురళీధర్ రెడ్డి, ఉప్పునుంతల మండలం గోపాలమిత్రలు ముజీబ్ అంజయ్య శ్రీనివాస్ తిరుపతయ్య మరియు కడ్తాల్ ఆమనగల్ కిల్లాఘణపూర్ మండలాల నుండి కూడ గోపాలమిత్రలు పాల్గొన్నారు