బదినేహాల్ లో భారీ వర్షాలకు తెగిన వంతెన
కౌతాళం
బదినేహల్ గ్రామం లో భారీ వర్షాలకు అతి సమీపంలో ఉన్న వంతెన కొట్టుకో పోయింది. కుంటనహాల్ గ్రామానికి బదినేహల్ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు పొలానికి వెళ్లడానికి కూలీలు పని వెళ్లడానికి ఎద్దుల బండ్లు మీద ఎరువులు తోలడనికి ఇబ్బందిగా మారింది. వంతెన తెగిపోవడంతో హైస్కూల్ వెళ్లే విద్యార్థిని విద్యార్థులు ఇవతలి ఒడ్డుకు చేరడానికి చాలా అవస్థలు పడ్డారు. రెండు కిలోమీటర్ల మేర స్కూల్ కి నడిచి వెళ్లారు. ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని గ్రామస్తులు, రైతులు వాపోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జి అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించారు. కనీసం మరమ్మతులకు నోచుకో లేకుండా పోయింది. అధికారులకు వెంటనే స్పందించి బ్రిడ్జి మరమ్మతులు కొనసాగించాలని రాకపోకలు సాగాలని అధికారులకు విన్న వించుకున్నారు.