
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి జీవితఖైదు
వరంగల్
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో వరంగల్ కోర్టు నిందితుడికి జీవితఖైదు ఖరారు చేసింది. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి.. హత్య చేసిన ఘటనలో నిందితుడు శివకు జీవితఖైదు విధిస్తూ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నిందితుడు శివ 2007 డిసెంబర్ లో చిన్నారిపై అత్యాచారం చేసి..హతమార్చాడు. ఈ కేసులో జులై 1న విచారణ ప్రారంభం కాగా..ఈ నెల 12న వాదనలు ముగిశాయి. తాజాగా ఈ కేసు విచారణ చేపట్టిన ధర్మాసనం నేరం రుజువైనట్లు వెల్లడిస్తూ..నిందితుడు శివకు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.