లక్నో
మాజీ కేంద్ర మంత్రి చిన్మయానంద తన నేరాలను అంగీకరించారు. బీజేపీ నేత చిన్మయానంద తనను లైంగికంగా వేధించినట్లు ఇటీవల ఓ న్యాయ విద్యార్థిని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు చేసినా చిన్మయానందను అరెస్టు చేయడం లేదని ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు చిన్మయానందను అరెస్టు చేశారు. యూపీకి చెందిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్
చిన్మయానందను విచారించింది. న్యాయ విద్యార్థిని చేసిన ప్రతి ఆరోపణనను.. బీజేపీ నేత అంగీకరించినట్లు సిట్ చీఫ్ నవీన్ ఆరోరా తెలిపారు. లైంగిక సంభాషణలు, బాడీ మసాజా చేయించుకున్నట్లు కూడా మాజీ మంత్రి ఒప్పుకున్నారు. అన్ని సాక్ష్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు సిట్ చీఫ్ తెలిపారు. తన అకృత్యాల పట్ల తనకే సిగ్గు వేస్తుందని, అందుకే మరింత సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నట్లు చిన్మయానంద పోలీసులకు తెలిపారు.