నంద్యాల
నంద్యాల లో వరదలతో ఇబ్భంది పడుతున్న కాలనీలలో నంద్యాల యమ్ యల్ ఏ శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి శుక్రవారం నాడు ఉదయం నుంచి సుడిగాలి పర్యటన చేశారు. శ్రమదానం బిడ్జీ. రెవెన్యూ క్వాటర్స్. స్టెట్ బ్యాంకు కాలనీ. రామ కృష్ణ పీజీ కాలేజీ. మరియు చామకాలువ ప్రాంతాల్లో. వరదలకు గురైన ప్రాంతాల లోని ప్రజలను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరదల విషయం పై సీయం జగన్ మోహన్ రెడ్డి కి తెలియడం జరిగింది అని అన్నారు. వరదలతో ఆస్తులు కోల్పోయిన వారిని. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. నంద్యాల లో ఎప్పుడూ మునకకు గురి కాని ప్రాంతాల్లో కూడా మునకకు గురి అయ్యాయని అన్నారు. వరద బాధితులకు నంద్యాల యందు ఏడు పునరావాస కేంద్రాల్లో అల్పాహారం. భోజనం ఏర్పాటు చేశామని తెలిపారు. నంద్యాల నియోజకవర్గ మైన నంద్యాల. గోసుపాడు మండలాల్లో చాలా నష్టం జరిగింది అని అన్నారు. రాబోయే 48 గంటల పాటు ప్రజలు
అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యవసాయ శాఖ. రెవెన్యూ అధికారులు. అర్ అండ్ బీ అధికారులు కలసి దెబ్బ తిన్న రోడ్లు. నష్టపోయిన పంటలను. ఆస్తి నష్టాన్ని . అంచనా వెస్తారని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించు తారని అన్నారు. ఈకార్యక్రమంలో. మాజి వార్డు కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.