సూర్యాపేట
కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ సమయంలో హుజూర్‌నగర్ అభ్యర్థిపై రాద్ధాంతం వద్దని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు కోసం పద్మావతిని గెలిపిస్తామన్నారు. టీఆర్‌ఎస్ అంతర్గత పోరుకు రసమయి వ్యాఖ్యలే నిదర్శనమని తెలిపారు. ఎర్రమంజిల్‌పై ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా హైకోర్టు తీర్పు ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు. సీజన్ ముగిసినా 30శాతం మంది రైతుబంధు అందలేదన్నారు. 56 లక్షల ఇళ్లకు మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయనడం అబద్ధమన్నారు.300 గ్రామాల్లో కనీసం 10 రోజులకోసారి కూడా నీళ్లు రావడం లేదని చెప్పారు. జగదీష్‌రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున ఇసుక దందా చేస్తున్నారని ఆరోపించారు. జగదీష్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు.
ఏపీలో ఏబీఎన్, టీవీ5 ప్రసారాలు పునరుద్ధరించాలని ఆయన కోరారు.