"చామరం"
లలితా సహస్ర నామ స్తోత్రములో సచామర రమావాణీ - సవ్య దక్షిణ సేవితా.
" చామర(మృగము వెంట్రకలతో చేయబడిన) వింజమరములను చేతిలో కలిగిన రమా(లక్ష్మి దేవి), వాణి(సరస్వతీ దేవి) ఎడమ(సవ్య), కుడి(దక్షిణ) వైపు ఉండి సేవిస్తుంటారు."
చమరీ మృగం( యాక్) తోకనుండి చామరాలు తయారు చేస్తారు. అవి హిమాలయాల్లో ఎక్కువగా ఉంటాయి. చమరీ మృగపు తోక కుచ్చుని దేవతలకి వింజామరలుగా చేయడం.జీవరాశుల్లో కూడా దైవాంశ ఉందని, అందుకే అవి పూజకి అర్హత పొందాయి.చమరీ మృగాల కేశాలతో తయారు చేసిన చామరాలు. వింజామరలు.
చామరం హిందూ దేవాలయాలలో కొన్ని పూజా సమయాలలో దేవునికి వింజామర లాగ వీచే ఉపకరణం. కొన్ని సేవలలో భక్తుల చేత కూడా వీనితో విసరమని చెబుతారు. దీనిని పొడవైన తెల్లని లేదా లేత గోధుమ రంగులో ఉండే మెత్తని వెంట్రుకలతో తయారుచేస్తారు. ఈ వెంట్రుకలు చమరీ మృగం తోకభాగం నుండి తీస్తారు. పట్టుకోవడానికి అనువుగా వెండితో చేసిన పిడి ఉంటుంది.
చమరీ మృగం వెంట్రుకలు కలిగిన క్షీరదాలు.హిందూ దేవతల పూజా కార్యక్రమాలలో ఉపయోగించే చామరం దీని వెంట్రుకలతో తయారుచేస్తారు.చమరీ మృగాల్ని వాటినుండి లభించే పాలు, ఉన్ని మరియు మాంసం కోసం పెంచుతారు. వీటిని బరువైన పనులు చేయడానికి కూడా ఉపయోగించుకుంటారు. స్థానిక రైతులు, వర్తకులు వీటిని వస్తువులను ఎత్తైన పర్వతాల గుండా రవాణా చేయటానికి ఉపయోగిస్తారు.
చమరీమృగాల పాలనుండి చ్ఛుర్పీ అనే ఒక రకం చీజ్ ను తయారుచేస్తారు. ఈ పాల నుండి తీసిన వెన్నను, టీలో కలిపి చేసిన బటర్ టీ ని టిబెట్ ప్రజలు విరివిగా తాగుతారు. ఈ వెన్నను దీపాలు వెలిగించటానికి, మత సంబంధ ఉత్సవాలలో ఉపయోగించే వెన్న శిల్పాలను సృష్టించడానికి కూడా ఉపయోగిస్తారు. పంచభూతత్వాలతో దేవాలయంలోను,పూజా మందిరంలోను దేవాతా విగ్రహాలకు పూజలు నిర్వహిస్తారు.దేవతా విగ్రహాలకు చందనం పూయుట "భూతత్వం",గంట మ్రోగించటం "ఆకాశతత్వం",దీపారాధన చేయటం "అగ్నితత్వం",తీర్థ ప్రసాదం ఇవ్వటం "జలతత్వం",చామర సేవ(వింజామర వీచుట) "వాయుతత్వం"గాను పూజలు నిర్వహిస్తారు.