YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

వాల్యుయేషన్ లో అనుమానాలు

వాల్యుయేషన్ లో అనుమానాలు

వాల్యుయేషన్ లో అనుమానాలు
విజయవాడ, 
గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయనే ఆరోపణలతో ఇప్పటికే ఆందోళన చెందుతున్న అభ్యర్థుల్లో మూల్యాంకంలోనూ తేడాలున్నాయన్న భావన కలుగుతోంది. ఆన్సర్ కీ ప్రకారం అంచనా వేసుకున్న మార్కులకు, తమకు వచ్చిన మార్కులకు ఏ మాత్రం పొంత లేదని.. మార్కుల్లో భారీ వ్యత్యాసం ఉందని వాపోతున్నారు.విజయనగరం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి కేటగిరీ-1 పరీక్ష రాయగా.. తుది ఆన్సర్ 'కీ' ప్రకారం నెగెటివ్ మార్కులు మినహాయించగా 66.25 మార్కులు వచ్చాయి. కానీ అధికారులు మాత్రం అతనికి షాక్ ఇచ్చారు. 
సెప్టెంబరు 19న విడుదల చేసిన ఫలితాల్లో ఆ అభ్యర్థికి కేవలం 11.5 మార్కులే వచ్చాయి.శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో అభ్యర్థికి 'కీ' ప్రకారం 54.2 మార్కులు రావాల్సి ఉండగా.. కేవలం 7.5 మార్కులే వచ్చాయి. వీరే కాక ఇలా ఎంతో మంది అభ్యర్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే మార్కుల విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్‌సైట్‌‌లో సూచించిన నెంబర్లలో సంప్రదించి, ఫిర్యాదు చేయవచ్చని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ అభ్యర్థులకు సూచించారు. పరీక్ష రాసిన అభ్యర్థుల సమాధాన పత్రం మూల్యాంక విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ నెగెటివ్ మార్కుల కారణంగా.. అభ్యర్థులు తమకు వస్తాయనుకున్న మార్కుల కన్నా తక్కువ మార్కులు వచ్చి ఉండొచ్చని ఆయన అన్నారు. అప్పటికీ తక్కువ మార్కులు వచ్చాయని అభ్యర్థులు భావిస్తే.. రీవెరిఫికేషన్ చేస్తామని విజయ్ కుమార్ తెలిపారు.

Related Posts