YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

యువతిపై ఏడుగురి అత్యాచారం..వీడియో తీసిన మరో ఇద్దరు

యువతిపై ఏడుగురి అత్యాచారం..వీడియో తీసిన మరో ఇద్దరు

యువతిపై ఏడుగురి అత్యాచారం..వీడియో తీసిన మరో ఇద్దరు
నిజామాబాద్ 
నిజామాబాద్ నగర శివారులో దారుణ  సంఘటన జరిగింది. ఒక యువతిపై ఒకరి తర్వాత మరొ కరు.. ఇలా ఏకంగా ఏడుగురు సామూహికంగా అత్యా చారానికి పాల్పడ్డారు. పైగా ఆ ఘూతుకాన్ని వీడియో చిత్రీకరించిన వైనం బయటపడింది. వివరాలు ఇలా వున్నాయి. నిజా మాబాద్ రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (24), ఇదే మండలానికి చెందిన ఆమె ప్రేమి కుడు కలిసి శుక్రవారం మధ్యాహ్నం వేళ నిజామాబాద్ శివారులో గల సారంగపూర్ హనుమాన్ ఆలయ శివారులోకి వెళ్లారు. ఆ తర్వాత సారంగపూర్ జిల్లా జైలు వెనుక గల అటవీ ప్రాంతంలోకి సదరు యువతిని అతడు తీసుకెళ్లి  అత్యాచారానికి పాల్పడ్డా డు. ఆపై తన స్నేహితులు మరో ఆరుగురిని సంఘట నా స్థలికి పిలిపించాడు. వారు కూడా  సదరు యువ తిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఈ అత్యాచార ఘటనను మరో ఇద్దరు యువకులు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. 
అనంతరం ఆ ఇద్దరు యువకులు జైలు పరిసర ప్రాంతంలో నిలిపి ఉంచిన తమ ఆటోలో ఇదివరకు రికార్డ్ చేసిన యువ తిపై అత్యాచార వీడియోలను చూడసాగారు.  సరిగ్గా ఇదే సమయంలో నిజామాబాద్ నగర 6వ పట్టణ పోలీసులు ఓ కేసు నిమిత్తమై  జైలు పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతం మధ్య లో  నిలిచి ఉంచిన ఆటోను గమనించారు. ఆటోలో ఉ న్న ఇద్దరు యువకులను ప్రశ్నించారు.  పొంతన లేని సమా ధానాలు ఇవ్వడంతో పోలీసులు తమదైన శైలిలో విచా రించారు. దాంతో ఈ దారుణం వెలుగు చూసింది. యువతి (24)పై తన స్నేహితుడితో పాటు మరో ఆరుగురు స్నే హితులు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డట్టు వారు జరిగిన విషయాన్ని  చెప్పారు. తాము వీడియో మాత్రమే తీశామని, ఈ ఘటనతో తమకేమి సంబం ధం లేదని పోలీసుల ఎదుట బావురుమన్నారు. దీంతో పోలీసులు ఆ యువకులను అదుపులోకి  తీసుకోవడం తో పాటు ఆయా మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. జరిగిన దారుణంపై నిజామాబాద్ నగర ఆరో టౌన్ పోలీసులు సదరు యువతిని స్టేషన్కు తీసుకొచ్చి విచా రించారు. ఈ సందర్భంగా తనపై ఏడుగురు సామూ హికంగా 
అత్యాచారానికి పాల్పడింది నిజమేనని వివరించింది. ఒకరి తర్వాత మరొకరు తన పై ఎలా లైంగిక దాడికి పాల్పడ్డారోనన్న విషయాన్ని చెప్పింది. అయితే పోలీసులకు  చిక్కిన ఇద్దరు మాత్రం తనపై దాడి జరుగుతుండగా  వీడియో తీశారని తెలిపింది.

Related Posts