YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

యదేఛ్చగా అరబ్ దేశాలకు అక్రమ రవాణా

యదేఛ్చగా అరబ్ దేశాలకు అక్రమ రవాణా

యదేఛ్చగా అరబ్ దేశాలకు అక్రమ రవాణా
హైద్రాబాద్, 
 ఐటీతోపాటు అభివృద్ధిలో అంతర్జాతీయ స్థాయికి దూసుకుపోతున్న హైదరాబాద్ నగరం అమ్మాయిల అక్రమ రవాణా బాగోతాలతో అపకీర్తిని మూటకట్టుకుంది. అమ్మాయిలను అక్రమంగా తరలించి వ్యభిచార గృహాలకు విక్రయించడంలో హైదరాబాద్ నగరం దేశంలోనే నాల్గవస్థానంలో నిలిచింది. జాతీయ నేర రికార్డుల సంస్థ అమ్మాయిల అక్రమ రవాణ, వ్యభిచార గృహాలకు విక్రయించిన అమ్మాయిల గురించి తన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో అమ్మాయిల విక్రయంపై 8,057 కేసులు నమోదు కాగా తెలంగాణలో 229 కేసులు, ఆంధ్రప్రదేశ్ లో 239 కేసులున్నాయి. వ్యభిచారం, అమ్మాయిల అక్రమ రవాణాలో ఏపీ మూడో స్థానం పొందింది. తెలంగాణాలో పోలీసులు 314 మంది అమ్మాయిలను వ్యభిచార గృహాల నుంచి కాపాడారు. ఉద్యోగాలిప్పిస్తామని ఆశ పెట్టి అమ్మాయిలను అక్రమంగా తీసుకువెళ్లి వారిని వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. 2016వ సంవత్సరంలో అమ్మాయిల అక్రమ రవాణ, విక్రయంపై హైదరాబాద్ నగరంలో 64 కేసులు నమోదైనాయి. మరో 76 మంది మహిళలను పోలీసులు వ్యభిచారం రొంపి నుంచి రక్షించారని నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో నివేదికలు తేటతెల్లం చేశాయి.బాగా బలిసిన అరబ్ షేక్‌లు.. అందమైన ఆడపిల్లల కోసం ఎంత డబ్బైనా వెదజల్లే శృంగార రాయుళ్లు.. కానీ చేతికర్ర లేనిదే నడవలేరు. అంత వృద్ధాప్యంలో ఉంటారు. కానీ వీళ్లకి పెళ్లి కోసం 16 ఏళ్ల బాలికలు కావాలి. అరబ్ దేశాల నుంచి విమానంలో దిగారు. ఇక్కడ కొంత మంది బ్రోకర్లతో కలసి 10 నుంచి 20 వరకు బాలికలను ఇంటర్వ్యూలు చేస్తున్నారు.వారిలో తనకు నచ్చిన బాలికను ఎంచుకుంటాడు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఎంత డబ్బైనా ఇవ్వడానికి సిద్ధపడతాడు. అతనికి తోడుగా ఇక్కడి బ్రోకర్లు. భోగభాగ్యాలతో సుఖంగా బతకొచ్చంటూ బాలికను, ఆమె కుటంబ సభ్యులను ప్రలోబపెట్టి ఆ అరబ్ షేక్‌కి ఇచ్చి పెళ్లిచేసి పంపేస్తారు.ఇంతకీ ఈ దగాకోరు పెళ్లిని సాక్షాత్తు ఖాజీ దగ్గరుండి మరీ జరిపిస్తాడు. రాయబార కార్యాలయాన్ని సంప్రదించి, కేవలం కొన్ని రోజుల వ్యవధిలో వీసా తదితర పత్రాలన్నీ సిద్ధం చేసుకుని ముక్కుపచ్చలారని బాలికలను అరబ్ దేశాలకు ఎగరేసుకుపోతున్నారు షేక్‌లు. అక్కడకు తీసుకెళ్లి బాలికలను చిత్రహింసలు పెడుతున్నారు. ఇదంతా హైదరాబాద్‌లోని పాతబస్తీ సాక్షిగా నిరంతరం జరిగే ప్రక్రియ. మొత్తానికి పెళ్లి పేరుతో దుర్మార్గానికి పాల్పడుతున్న షేక్‌లు, బ్రోకర్లు, ఖాజీల గుట్టురట్టయింది. పేద ముస్లిం కుటుంబాల దుస్థితిని ఆసరాగా తీసుకుని యువతుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ట్రాఫికింగ్‌ రాకెట్‌ను హైదరాబాద్‌ సిటీ పోలీసులు బట్టబయలు చేశారు. పాతబస్తీలోని పలు లాడ్జీలపై దాడులు జరిపి 15 ఏళ్ల బాలికను పెళ్లిచేసుకున్న ఒమన్‌కు చెందిన అలీ మయాహీ హబీబ్‌ అలీ ఇస్సా అనే వృద్ధషేక్‌ను, అతడి ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశారు. ముగ్గురు ఖాజీలు, నలుగురు లాడ్జీ యజమానులు, ఐదుగురు బ్రోకర్లు సహా 20 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బ్రోకర్లలో మహిళలే అధికంగా ఉండడం పోలీసులను షాక్‌కు గురిచేసింది. కాగా, ఒమన్‌కు చెందిన షేక్ తమ కుమార్తెను పెళ్లిచేసుకుని ఆ దేశానికి తీసుకెళ్లాడని, అక్కడ ఆమెను చిత్రహింసలు పెడుతున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు ఇటీవల పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పెళ్లికి బ్రోకర్లను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోని మొత్తం షాదీ షేక్‌ల గుట్టును బట్టబయలు చేశారు.

Related Posts