YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కనీసం జ్ఞానం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు

కనీసం జ్ఞానం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు

కనీసం జ్ఞానం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు
తాడేపల్లి
పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతి బట్టబయలు అయింది. పోలవరం పనుల రివర్స్ టెండరింగ్ లో అక్రమాలు నిర్ధారణ అయింది. రివర్స్ టెండరింగ్ తో ప్రభుత్వానికి 50 కోట్ల ఆదా అయిందని ఇరిగేషన్ శాఖమంత్రి  అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ కేవలం 300 కోట్ల టెండర్లలో 50 కోట్లు మిగిల్చాం. రివర్స్ టెండరింగ్ పై తెలుగుదేశం పార్టీ అసత్యప్రచారం చేస్తోంది. రివర్స్ టెండరింగ్ పారదర్శకంగా నిర్వహించాం. చంద్రబాబు గతంలో 4.77 శాతం ఎక్కువకు టెండర్ ఇచ్చారు. అదే సంస్ద(మ్యాక్స్ ఇన్ ఫ్రా) ఈరోజు 15.6 శాతం లెస్ కు టెండర్ వేసిందని అన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రతిపనికి రివర్స్ టెండరింగ్ కు వెళ్తాం. దేశంలో ఓ విజన్ ఉన్న ముఖ్యమంత్రి  వైయస్ జగన్. ఎక్కడైనా టెండర్ లెస్ కు వేయించి అనుకూలమైనవారికి కట్టబెడతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పధ్దతులు మార్చుకోవాలి.అసత్యప్రచారాలు మానుకోవాలి. చంద్రబాబుకు, అయన అనుకూలమైన మీడియాకు చెబుతున్నాం 
అసత్యప్రచారాలు మానుకోవాలని. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు.అదేమంటే 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారని అన్నారు. రివర్స్ టెండరింగ్ లో నవయుగకూడా పాల్గొనవచ్చు.దానిని మేం బ్యాన్ చేయలేదే.అర్హత ఉన్న సంస్దలన్నీ కూడా పాల్గొనవచ్చు. చంద్రబాబుకు సంబంధించిన సంస్దలు కూడా పాల్గొనవచ్చని చెబుతున్నా. పోలవరం పనులు ఆగిపోయాయని దుష్ప్రచారం చేస్తున్నారు. భారీవర ద వస్తుంటే పనులు చేయడం సాధ్యమేనా అని అడిగారు. రివర్స్ టెండరింగ్ అంటే చంద్రబాబుకు భయంఎందుకు. స్పిల్ వే కాఫర్ డ్యాం మినహా ఏం కట్టారు. ప్రాజెక్ట్ విలువ 55 వేల కోట్లు ఇంకా 32 వేల కోట్ల పనులు చేయాల్సింది ఉంది. వాస్తవం ఇలా ఉంటే 70 శాతం పని పూర్తయిందని ఎలా చెబుతారు. ఇప్పటికి అయిన 40 శాతం పనులు అయ్యాయి.అవి కూడా వైయస్ హయాంలో అయిన పనులతో కలుపుకుని. చంద్రబాబు హయాంలో ప్రతి పనికి నాలుగు శాతం అధికమేని విమర్శించారు. టెండర్లు ఎవరికి వస్తాయో చంద్రబాబు చెబుతున్నారు ఆయనఏమైనా కలగన్నారా? మీరు దోపిడీ చేయబోయారా మేం మీ దోపిడీని అడ్డుకుని ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నాం. మీ హయాంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు.లక్షా 25 వేల ఉద్యోగాలు ఇస్తే దానిపై కూడా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. డ్యామ్ లన్నీ నిండుతున్నాయి పోలాలన్నీ పచ్చగా కనబడుతున్నాయి. నీ చిల్లర,దోపిడీ 
రాజకీయాలవల్ల ప్రజలు 23 సీట్లు ఇచ్చారు పద్దతి మార్చుకోకపోతే 13 అవుతాయో,10 అవుతాయో అని వ్యాఖ్యానించారు. 

Related Posts