ప్రత్యేక ప్రణాళిక చురుకుగా కలెక్టర్
వనపర్తి
గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్న 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి చురుకుగా పాల్గోంటున్నారు. కార్యక్రమం ప్రారంభమైన రోజు నుంచి జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాలలో విస్తృతస్థాయిలో పర్యటిస్తున్నారు. గ్రామంలో నెలకొన్న అపరిశుభ్రత ను తొలగించడంలో కలెక్టర్ నిమగ్నమై పోయారు. కలెక్టరే స్వయంగా గ్రామాలలో నెలకొన్న అపరిశుభ్రత ను తొలగిస్తుండమే కాకుండా తాను స్వయంగా విధుల్లో ఉన్న ప్లాస్టిక్ సంచులను, పిచ్చి మొక్కలను తొలగిస్తున్న వంటి సంఘటనలు చూసిన వారంతా ఆమెతో పాటు చేయి కలుపుతున్నారు. జిల్లాలోని గోపాల్ పేట మండలం ఏదుల గ్రామంలో కలెక్టర్ శ్రమదానంతోపాటు పరిశుభ్రత
కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తికి చెందిన ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు మొలిచి అపరిశుభ్రంగా ఉండటాన్ని ఆమె గుర్తించారు. ఆమె వెంటనే ఆయన్ను పిలిపించారు. ఖాళీ స్థలాన్ని అపరిశుభ్రంగా వచ్చినందుకు 500 రూపాయల జరిమానా కూడా విధించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా గ్రామాలలోని వీధుల్లో పర్యటిస్తూ వీధుల్లో నెలకొన్న
వివిధ సమస్యలపై ప్రజల ద్వారా తెలుసుకోవడమే కాకుండా స్వయంగా పనులు చేయడంపై ప్రజలు కలెక్టర్ కు నీరాజనాలు పలుకుతున్నారు. పరిశుభ్రత పై అవగాహన కల్పించంపై అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అంటూ కలెక్టర్ స్వయంగా గ్రామాలలో మొక్కలు
నాటడం వంటి కార్యక్రమాలను చెబుతున్నారు. గ్రామాలలో ఎవరు కూడా ప్లాస్టిక్ ను వాడరాదని, ముఖ్యంగా షాపు యజమానులు ప్లాస్టిక్ బ్యాగులను వాడరాదని బుధవారం జిల్లాలోని కొత్తకోట పట్టణ షాపు యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞలు చేయించారు, వనపర్తి జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చడమే కాకుండా
పచ్చదనంతో జిల్లా కళకళలాడుతూ ఉండాలనే ఉద్దేశంతో చెట్లను సంరక్షించాలనే ఉద్దేశమే కలెక్టర్ ఆశయంగా పెట్టుకున్నారని ప్రజలు చెప్పుకుంటున్నారు.