YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఎస్టిమేట్‌ కమిటీ సభ్యురాలిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి నియామకం

ఎస్టిమేట్‌ కమిటీ సభ్యురాలిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి నియామకం

ఎస్టిమేట్‌ కమిటీ సభ్యురాలిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి నియామకం
రాజమహేంద్రవరం 
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్టిమేట్‌ కమిటీ సభ్యులుగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్‌కు చోటు దక్కింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్‌ ఈ అంచనాల కమిటీలో చోటు సంపాదించుకున్నారు. కాగా ఎమ్మెల్యే అదిరెడ్డి భవాని 
శ్రీనివాస్‌ ప్రభుత్వ అంచనాల సంఘం సభ్యురాలుగా నియమితులైన సందర్భంగా.. టీడీపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అంచనాల కమిటీ అనేది శాసన సభ ఏర్పాటు చేసిన శాసన సభ్యుల కమిటీ నిధుల వినియోగం విషయంలోని ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖల విభాగాల పనితీరును పరిశీలించి.. పర్యవేక్షించే అధికారం ఉంటుంది. పరిపాలన ఆర్థిక 
వ్యవస్థను బలోపేతం చేసేందుకు విధానం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలపై కూడా ఈ కమిటీ సభ్యులు అధికారం ఉంటుందని రాజకీయ ప్రముఖులు శాసనసభ వ్యవహారాల కమిటీ ద్వారా ప్రభుత్వం ద్వారా ఏర్పాటైన కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే వీటిని చిన్న శాసనసభలు అని కూడా పిలుస్తారు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతటి ప్రాధాన్యత ఈ కమిటీలకు ఉంటుందని చెప్తున్నారు. కాగా ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ అంచనాల కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్‌కు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు.

Related Posts