డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు కల్పించాలని ఆత్మహత్యాయత్నం
గోదావరి ఖని
గోదావరిఖనికి చెందిన శనిగరపు నారాయణ గత కొన్నేళ్ల క్రితం సింగరేణిలో పనిచేసి డిస్మిస్ అయ్యాడు. తిరిగి సింగరేణి సంస్థలో అవకాశం కల్పించాలని డిస్మిస్ కార్మికులతో యూనియన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదని ఆవేదన చెందాడు. ఇదే క్రమంలో గోదావరిఖని టీబీజీకేఎస్ ఆఫీసులో తెలంగాణ జెండాలతో మెడకు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నారాయణ ఆపివేశారు. పదేళ్ల నుంచి సంస్థలో ఉపాధి కల్పించకపోవటంతో డిస్మిస్ కార్మికుల జీవితాలు ఆర్థికంగా చితికిపోతున్నాయన్నారు. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులు తమ గోడును అర్థం చేసుకుని డిస్మిస్ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.