YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ ఎన్ ఎస్ యు ఐ అసెంబ్లీముట్టడి

విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ ఎన్ ఎస్ యు ఐ అసెంబ్లీముట్టడి

విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ ఎన్ ఎస్ యు ఐ అసెంబ్లీముట్టడి
హైదరాబాద్  
ఇంటర్మీడియేట్ విద్యార్థుల ఆత్మహత్యలు , ఫలితాల తప్పులకు కారణమైన వారి పై ఇప్పటికీ చర్యలు తీసుకకోకపోవడాన్ని నిరసిస్తూ ఎన్ ఎస్ యు ఐ అసెంబ్లీని ముట్టడించింది. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు వెంకట్ బలమూరి మాట్లాడుతూ ఇంటర్మీడియేట్ విద్యార్థుల ఆత్మహత్యలు , ఫలితాల తప్పులకు కారణమైన వారి పై అసెంబ్లీ లో క్లారిటీ 
వస్తుందని చివరి రోజు వరకు చూశాం కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం తో అసెంబ్లీ ముట్టడించాం అని తెలిపారు. రీ కరెక్షన్ ,రీ వాల్యూయేషన్ లకు విద్యార్థులు డబ్బులు చెల్లించిన తర్వాత ప్రభుత్వం ఫీజు లేదు అని ప్రకటించింది. అప్పటికే చాలా మంది విద్యార్థులు డబ్బులు చెల్లించేశారు. అయితే వాటిని ఇప్పటి వరకూ తిరిగి ఇవ్వలేదు. విద్యార్థులు చెల్లించిన ఫీజు ఒక కోటి రూపాయల వరకు ఉంటుందని ఆర్ టి ఐ లో ప్రశ్నవేస్తే తెలిసింది అవి ఎలా తిరిగి చెల్లిస్తారు అనే అంశంపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదని ఆయన అన్నారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ఆదుకోవడం లో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఇంటర్మీడియట్ బోర్డ్ లో ఫలితాల అవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థ, బోర్డు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Related Posts