YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి

మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి

మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి
చిత్తూరు
టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్(68) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు.
గత కొన్నిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇవాళ మధ్యాహ్నం 2:07 గంటలకు శివప్రసాద్ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. శివప్రసాద్ ఇకలేరన్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, అనుచరులు, టీడీపీ కార్యకర్తలు 
కన్నీరుమున్నీరవుతున్నారు. శివప్రసాద్ స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పులిత్తివారిపల్లి. 1951 జూలై 11న నాగయ్య, చెంగమ్మ దంపతులకు నాటి మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. ఆ తరువాత ఒక వైద్యునిగా కొంత కాలం వైద్య సేవలు అందించారు. శివప్రసాద్ స్వగ్రామం పులిత్తివారిపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నారావారి పల్లి ఉంది. ఆయన చిన్నతనంలోనే చంద్రగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో కలసి చదువుకున్నారు. బాబు గారితో ఆయన పరిచయం చంద్రగిరి పాఠశాలలో ఏర్పడింది. అలా వారిద్దరూ మంచి మిత్రులుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కలసి ఉన్నారు. శివప్రసాద్  రాజకీయాల్లోనే కాకుండా పలు సినిమాల్లో కూడా నటించారు. ఇదిలా ఉంటే.. 2009, 2014 టీడీపీ తరఫున ఎంపీగా పోటీచేసి శివప్రాద్ విజయం సాధించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డెప్ప చేతిలో ఓడిపోయారు.

Related Posts