YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఖమ్మం జిల్లాకు యూరియా సరఫరా పెంచాలి - మంత్రి నిరంజన్ రెడ్డిని కోరిన ఎంపి నామా

ఖమ్మం జిల్లాకు యూరియా సరఫరా పెంచాలి - మంత్రి నిరంజన్ రెడ్డిని కోరిన ఎంపి నామా

ఖమ్మం జిల్లాకు యూరియా సరఫరా పెంచాలి - మంత్రి నిరంజన్ రెడ్డిని కోరిన ఎంపి నామా
హైదరాబాద్ 
ఖమ్మం జిల్లాకు నాలుగు వారాలకు సరిపడేలా 10 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని టీఆర్ ఎస్ లోక్ సభాపక్ష నాయకులు,ఖమ్మం టీఆర్ ఎస్ ఎంపీ శ్రీ నామా నాగేశ్వరరావు కోరారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారు.ఖమ్మం జిల్లా వ్యవసాయ 
అధికారి(డీఏఓ) ఝాన్సీ లక్ష్మీ జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిన దృష్ట్యా యూరియా సరఫరాను పెంచాలని ఎంపీ నామా నాగేశ్వరరావు ని కోరారు.దీంతో తక్షణమే స్పందించిన ఎంపీ గారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ ని ఖమ్మం జిల్లాకు యూరియా సరఫరాను పెంచాలని కోరారు. నాలుగు వారాలకు సరిపోయేలా 10 వేల మెట్రిక్ టన్నుల యూరియాను 
ఖమ్మం జిల్లాకు సరఫరా చేయాలని ఎంపీ నామా, మంత్రి గారిని కోరారు. ఖమ్మం జిల్లాలో రైతులు ఈ ఏడాది 2,04,711 హెక్టార్లలో పంటలు సాగు చేశారాని ఎంపీ నామా గారు తెలిపారు. టీఎస్ మార్క్ ఫెడ్ ఖమ్మం ఇప్పటి వరకు 27,181.36 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసిందని మంత్రికి వివరించారు. జిల్లాలో భారీ వర్షాలు కురిస్తుండటం,గోదావరి నదితో పాటూ, 
ఇతర రిజర్వాయర్లలో పుష్కలంగా నీరుండటంతో జిల్లాలో పంటల సాగు గణనీయంగా పెరుగుతోందని, అందువల్లా జిల్లాలో యూరియా అవసరం పెరుగుతోందని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి నిరంజన్ రెడ్డి ఖమ్మం జిల్లాకు సరిపడా యూరియాను సరఫరా చేస్తామని ఎంపీ నామాకు హామి ఇచ్చారు.

Related Posts