YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

వరద బాధితులను ఆదుకుంటాం

వరద బాధితులను ఆదుకుంటాం

వరద బాధితులను ఆదుకుంటాం
నంద్యాల
నంద్యాల మునిసిపల్ ఆఫీసులో అధికారులతో వరద పరిస్థితి పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి సమీక్ష జరిపారు. సీఎం మాట్లాడుతూ దేవుడి దయతో రాయలసీమ లో వర్షాలు బాగా కురిశాయి. వర్షపాతం నార్మల్ అయింది. 
కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్ లో 17 మండలాల్లో వర్షం.ఎక్కువ పడి.. 784 కోట్ల మొత్తం లాస్ లో ఆర్ అండ్ బి  రోడ్లు  422 కోట్లు ,.103 కోట్లు పీఆర్  రోడ్లపై నష్టం వాటిల్లిందని అన్నారు. పంట నష్టం 31 వేల హెక్టార్లలో,, రెండు వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు ధ్వంసమయ్యాయి. అధికారులు వరద ప్రాంతాల్లో పంట నష్టం, ఇతర నష్టం వివరాల సేకరణలో లిబరల్గా మానవత్వం తో ఉండండని సూచించారు. భవిష్యత్ లో కుందూ నదీ ఏరియా లో , నంద్యాల ప్రాంతంలో వరద నష్టం జరగ కుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటాం. 47 సంవత్సరాల సీడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం 1200 ల టీఎంసీ ల నుండి 10 సంవత్సరాల లో 600 ల టీఎంసీల కు, 5 సంవత్సరాల లో 400 ల టీఎంసీల కు  శ్రీశైలం వరద ప్రవాహం పడిపోయిందని అన్నారు. కృష్ణా ఆయకట్టు, రాయలసీమ ను సస్యశ్యామలం చేయడానికి తెలంగాణ సీఎం తో మాట్లాడి గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం చేయడానికి చర్యలు చేపట్టాం. రాయలసీమ లో ప్రతి డ్యాము ను నీటితో నింపుతామని అన్నారు.  కుందూ నదిని వెడల్పు చేసి స్థానిక వరద నష్టం నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నంద్యాలలో చామ కాల్వ వెడల్పు, ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి చర్యలు ప్రారంభించారు. మధ్యలో ఆగాయి.తిరిగి చేస్తామని అయన అన్నారు.  వరద బాధితులను అందరినీ ఆదుకుంటాం.. రేగులర్ గా ఇచ్చే వరద ఆర్థిక సాయం కంటే ప్రతి ఇంటికీ అదనంగా 2 వేలు ఆర్థిక సహాయం ఇవ్వాలని..కలెక్టర్ కార్యాలయం లో ప్రత్యేక సెల్ పెట్టాలని కలెక్టర్ వీరపాండియన్ ను సీఎం ఆదేశించారు. ప్రతి ఒక్కరి మెహంలో చిరునవ్వు నింపేలా అధికారులు మానవత్వం తో పని చేసి వరద బాధితులను ఆదుకోండని అన్నారు. 

Related Posts