YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఏం తమాషా చేస్తున్నారా - అధికారులపై మండిపడ్డ జిల్లా కలెక్టర్ 

ఏం తమాషా చేస్తున్నారా - అధికారులపై మండిపడ్డ జిల్లా కలెక్టర్ 

ఏం తమాషా చేస్తున్నారా - అధికారులపై మండిపడ్డ జిల్లా కలెక్టర్ 
వికారాబాద్ 
గ్రామాల అభివృద్ధి కై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మార్పుకు శ్రీకారం, 30 రోజుల ప్రణాళిక కార్యక్రమం లో నిర్లక్ష్యం వహించిన అధికారుల పై,ఏం తమాషా చేస్తున్నార అంటూ, వికారాబాద్ జిల్లా  పాలనాదికారి,మస్రత్ ఖనమ్ అయేషా అధికారుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్యక్రమం లో భాగంగా, ఆమె వికారాబాద్ జిల్లా బొంరస్ పేట మండలం లోని, బుర్రితాండ,మెట్లకుంట, 
బొంరస్ పేట, తుంకిమెట్ల, నాందార్  పూర్,తదితర గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో కార్యక్రమం ప్రారంభించి 15 రోజులు గడుస్తున్న కార్యక్రమం  ముఖ్య లక్ష్యం నెరవేరుచుటలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత శాఖాదికారులందరి పై అసహనం వ్యక్తం చేశారు.ఆయా  గ్రామాల్లోని ప్రధాన రహదారుల కిరు వైపుల చెత్త పేరుకుని ఉండడాన్ని చూసి,ప్రధాన రహదారుల పరిస్థితి ఈ విధంగా ఉంటె గ్రామాల్లోని వాడల పరిస్థితి ఏ విధంగా ఉంటుందొ అర్ధం అవుతుందని,మీరు ఇక్కడ ఏం చేస్తున్నారoటు సంభందిత సర్పంచ్&పంచాయతీ కార్యదర్శి లపై అసహనం వ్యక్తం చేశారు. రోడ్డు పై చెత్త వేసిన ప్రతి ఒక్కరికి వెంటనే 500 రూపాయల జరిమానా విదించాలని, సంభందిత అధికారులను ఆదేశించారు. బుర్రి తాండ లో, రోడ్డు పై చెత్త వేసిన లలిత అనే మహిళ కు 1000రూపాయల జరిమానా విదించారు. తుంకిమెట్ల లో జిల్లా పాలనాదికారి మీ ఇంటి చెత్తను ఎక్కడ వేస్తారని అడుగగా,పంచాయతీ కార్యదర్శి  రోడ్డు పై వేయామన్నాడని సదరు మహిళా తెలుప డంతో, ఇక్కడ అధికారులు కానీ, సిబ్బంది కానీ ప్రజలకు అవగాహనా కల్పించడం లో విఫలం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా తాను 565 గ్రామాల్లో కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యన్ని తెలియ జేస్తూ మార్గ దర్శకం చేస్తాను కానీ, మండల పరిధిలో  ఉన్న 
అధికారులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించి వారి బాగాస్వామ్యం తో గ్రామ అభివృద్ధి చేపట్టా లన్నారు. ప్రధానంగా ఆమె ఆయా గ్రామాల్లోని పాఠశాలలను సందర్శించి, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ని శౌచాలయాలు నిరుపయోగం లో ఉండడం తో, విద్యార్థులు ఆరు బయటే మలమూత్ర విసర్జన చేస్తున్న విషయం స్వయంగా ఆమె దృష్టికి రావడం తో,తక్షణం సింటెక్స్ డబ్బాలు ఏర్పాటు చేసి, శౌచాలయాలను ఉపయోగం లోకి తేవాలని పాఠశాల హెచ్ఎం లను ఆదేశించారు.మెట్లకుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో,అంగన్వాడీ సెంటర్ లో,  శౌచాలయాలు లేక పోవడం తో, వెంటనే పని మొదలు పెట్టండని, చెప్పి, ముందుండి, పనులు చేయించారు. 

Related Posts