YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ఈ నెల 23 నుంచి 27 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్

ఈ నెల 23 నుంచి 27 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్

ఈ నెల 23 నుంచి 27 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్
అమరావతి 
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల మెరిట్ లిస్ట్ లు సిద్ధం చేశామని మున్సిపల్శాఖ కమిషనర్ విజయ్కుమార్ తెలిపారు. మెరిట్ లిస్ట్ ను జిల్లాల కలెక్టర్లకు పంపినట్లు వెల్లడించారు. ఈనెల 21 నుంచి 23 వరకు ఎంపికైన అభ్యర్థులకు కాల్ లెటర్ పంపిస్తామని, అభ్యర్థులకు ఈ-మెయిల్, ఎస్ ఎమ్ ఎస్ ద్వారా కూడా సమాచారం అందుతుందని పేర్కొన్నారు. ఎంపికైన 
అభ్యర్థులు ఆన్ లైన్ లో సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలని, ధరఖాస్తులో చెప్పిన అర్హత, కుల ధృవీకరణ, క్రీమిలేయర్, నివాస సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలని సూచించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, ఈ నెల 27న అభ్యర్థులకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 20 
బృందాలను ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక ఏ అభ్యర్థి ఎక్కడ ఉద్యోగం చేయాలన్నది నిర్ణయిస్తామని, 60 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.

Related Posts