హుజూర్ నగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సైదిరెడ్డి
హైదరాబాద్
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి హుజుర్‌నగర్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకే మరోసారి సీఎం
అవకాశమిచ్చారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చెయ్యడం తో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. అక్టోబరు 21న పోలింగ్ జరిగి, అదే నెల 24న ఫలితాలు విడుదల కానున్నాయి.