YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

లైంగిక వేధింపుల ఘటనపై స్పందించింది మహిళా కమిషన్‌

లైంగిక వేధింపుల ఘటనపై స్పందించింది మహిళా కమిషన్‌

లైంగిక వేధింపుల ఘటనపై స్పందించింది మహిళా కమిషన్‌
విజయవాడ 
మచిలీపట్నంలోని సారా గ్రేస్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ కరస్పాండెంట్‌ విద్యార్థినులపై  లైంగిక వేధింపుల ఘటనపై మహిళా కమిషన్‌ స్పందించింది. కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ శనివారం కాలేజీని సందర్శించారు. ఈ క్రమంలో విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించిన ఆమె..ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో సహా ఇతరులెవరినీ కమిషన్‌ ఈ కార్యక్రమానికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో విద్యార్థినులతో సమావేశమైన వాసిరెడ్డి పద్మ కళాశాల కరస్పాండెంట్‌ తీరుతెన్నుల గురించి ఆరా తీశారు.తన కోరిక తీరిస్తేనే అన్ని సబ్జెక్టులు పాస్‌ చేయిస్తానని, లేదంటే జీవితాంతం ఫెయిల్‌ అయ్యేలా చేస్తానంటూ ఆ విద్యాసంస్థలోని ఆడపిల్లలను లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్న కరస్పాండెంట్‌ వికృత చేష్టలను ఓ విద్యార్థిని ధైర్యంగా ప్రతిఘటించింది. జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నంలోని సారా గ్రేస్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌లో పశ్చిగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ విద్యార్థిని బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు చేసేందుకు చేరింది. రెండు సంవత్సరాల పాటు అన్ని సబ్జెక్టులు పాస్‌ అవుతూ వచ్చింది.మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన తరువాత కళాశాల కరస్పాండెంట్‌ ఎస్‌.రమేష్‌ కన్ను ఆ విద్యార్థినిపై పడింది. అప్పటి నుంచి ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. తన కోరిక తీరిస్తే మూడు, నాలుగో సంవత్సరాల్లో సబ్జెక్టులు పాస్‌ చేయిస్తానని, లేదంటే ఫెయిల్‌ చేస్తానంటూ బెదిరించాడు. అందుకు ఆ విద్యార్థిని అంగీకరించకపోవడంతో అన్నట్లుగానే మూడో సంవత్సరంలో ఓ సబ్జెక్టులో ఫెయిల్‌ చేశాడు. విద్యార్థిని సప్లిమెంటరీలో పరీక్ష రాయగా మళ్లీ ఫెయిల్‌ అయ్యేలా చేశాడు. దీంతో సహనం కోల్పోయిన విద్యార్థిని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు, బంధువులకు చెప్పి విలపించింది. జిల్లా ఏఎస్పీకి ఫిర్యాదు చేయగా  కేసు నమోదు చేయాలని ఆయన పోలీసులను ఆదేశించారు.

Related Posts