మున్సిపల్ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదముద్ర
హైద్రాబాద్,
ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ మున్సిపల్ సవరణ బిల్లు-2019ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ బిల్లుకు సంబంధించిన వివరాలు సభలో వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో, నగరాల్లో పాలన కోసం ఆరు వేరువేరు చట్టాలు అమలులో ఉన్నాయి. ఇవన్నీ చాలా పురాతనమైనవి, చాలా ఏళ్ల క్రితం నాటివి. పట్టణ పరిపాలనలో ఎన్ని బిల్లులు, చట్టాలు అమలులోకి వచ్చినప్పటికీ.. ఆయా చట్లాల్లో ఉన్న లోపాల వల్ల, వాటి కార్యచరణ సక్రమంగా సాగడం లేదు. దీనివల్ల పట్టణ ప్రణాళిక అనుకన్న విధంగా ముందుకు సాగడం లేదు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-1965, తెలంగాణ మున్సిపల్ చట్టం-1994, టౌన్ మరియు కంట్రీ ప్లానింగ్ చట్టం-1920, అర్బన్ డెవలెప్‌మెంట్ అథారిటీ చట్టం-1975, జీహెచ్‌ఎంసీ యాక్ట్-1955, హెచ్‌ఎండీఏ యాక్ట్-2008 ఈ ఆరు చట్టాలు ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులకు తగ్గట్లు రూపొందిచారు.ఆ చట్టాలకు నేటి పరిస్థితులకు ఎలాంటి పొంతన లేదు. జనాభా పెరిగింది, పట్టణీకరణ మారింది. నేటి పరిస్థితులకు తగ్గట్లు, ప్రజల అవసరాలకు తగ్గట్లు ఈ ఏడాది జూలై 19 నాడు సీఎం కేసీఆర్ గారు తమరి(స్పీకర్) అనుమతితో కొత్త మున్సిపల్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీని ప్రధాన ఉద్ధేశ్యం టీ-ఎస్ ఐపాస్ ఏ విధంగానైతే విజయవంతమైందో, (అంటే పరిశ్రమల అనుమతులను వేగవంతం చేయడం) ఈ చట్టం ద్వారా కూడా పారదర్శకమైన అనుమతులను, విధానాలను తీసుకురావాలన్నది ప్రధానాంశం. పురపాలన అంటే పాలనలో ప్రజలను భాగస్వాములను చేయడం, పురపాలనలో పౌరుడే కేంద్రబిందువు కావాలనీ, పౌరుడే పాలకుడు కావాలనే సదుద్ధేశ్యంతో సిటిజన్ ఫ్రెండ్లీ అర్బన్ పాలనను అందుబాటులోకి తెస్తున్నాం. అవినీతికి ఆస్కారం లేకుండా చేయడం, అనుమతులు త్వరితగతిన ఇవ్వడం, పూర్తి పాలనను పారదర్శకంగా ఉండేలా చూసుకోవడం, నగర మరియు పట్టణ పాలనను సంస్థాగతంగా బలోపేతం చేయడం ఈ చట్టం ఉద్దేశ్యం అని, ఇందులో పూర్తిస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనట్టు మంత్రి తెలిపారు. ఈ బిల్లును స్పీకర్ సభ్యుల అనుమతితో ఆమోదించారు.ఐటీలో మనమే సూపర్ టీ రంగంలో హైదరాబాద్ నగరం త్వరలోనే బెంగళూరును దాటిపోతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఆఫీస్ స్పేస్ ఆక్యుపేషన్‌లో హైదరాబాద్ బెంగళూరును దాటిపోయింది. అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాం కాబట్టే 17 శాతం వృద్ధిరేటు సాధ్యమైంది. ఐటీ రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఐదున్నర లక్షలకు చేరింది. తెలంగాణ ఏర్పడే కంటే ముందు ఐటీ రంగంలో 3 లక్షల మంది ఉద్యోగులు పని చేసేవారు. ఐటీ రంగంలో దిగ్గజాలైన కంపెనీలు ఫేస్‌బుక్, ఆపిల్, గూగుల్, అమెజాన్.. బెంగళూరు కాదని హైదరాబాద్‌కు వచ్చాయి. టీఆర్‌ఎస్ సర్కార్ సమర్థత వల్లే ఆ కంపెనీలు హైదరాబాద్‌కు తరలివచ్చాయి. 12 లక్షల 67 వేల ఉద్యోగాలు టీఎస్‌ఐపాస్ ద్వారా సృష్టించాం. బీజేపీ, యూపీఏ ప్రభుత్వాలు ఐటీఐఆర్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఐటీఐఆర్ ప్రాజెక్టును కొనసాగించమని మోదీ సర్కార్ తేల్చిచెప్పింది. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా మా పని మేం చేసుకుంటూ పోతున్నాం. తెలంగాణ వచ్చిందే ఉద్యోగాల కోసం. కాబట్టి ఉద్యోగ కల్పన సృష్టిస్తున్నాం. రాష్ట్రం యువతకు కేసీఆర్ సర్కార్‌పై సంపూర్ణ విశ్వాసం ఉంది. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మాని.. అభివృద్ధికి సహకరించాలి అని మంత్రి కేటీఆర్ సూచించారు.