ఎస్ పేరుతో అక్షరానికి డేంజర్ నిజమౌతున్న వాస్తు పురుష్ మాటలు
హైద్రాబాద్,
కొద్ది రోజులుగా ప్రముఖుల వరుస మరణాలు, వివాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయాలతో పాటూ వివిధ రంగాల్లో ప్రముఖులను ఒకరి తర్వాత మరొకర్ని దురదృష్టం వెంటాడుతోంది.. కొందరు ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నారు. ఇలా వరుస మరణాలు, వివాదాలతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వరుస సంఘటనల వెనుక బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు పురుష ప్రసాద్. సంఖ్యా శాస్త్రాన్ని నమ్మేవారు.. నమ్మని వారు ఆలోచించాలంటున్నారు.. దీనికి కొన్ని ఉదాహరణల్ని కూడా చెప్పుకొచ్చారు.2019-2020లో 'ఎస్' అక్షరంతో పేరు మొదలయ్యే కొందరు ప్రముఖుల్ని మరణాలు, వివాదాలు వెంటాడాయంటున్నారు వాస్తు పురుష. కాఫీ డే ఫౌండర్ సిద్ధార్థ్ ఆత్మహత్య.. ఆ తర్వాత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ మరణం.. కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్.. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణాల గురించి ప్రస్తావించారు. వీరి పేర్లన్నీ 'ఎస్' అక్షరంతోనే మొదలవుతున్నాయి. అంతేకాదు టీడీపీ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ కూడా అనారోగ్యంతో బాధపడుతూ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారు . ఈయన పేరు కూడా 'ఎస్'తోనే ప్రారంభమవుతుందన్నారు.ప్రముఖ రాజకీయ నాయకుల మరణాన్ని గ్రహణం శాసించిందన్నారు వాస్తు పురుష ప్రసాద్. 2019-20లో.. 16-7-2019న ఏర్పడిన చంద్రగ్రహణం కారణంగా రాజకీయ ప్రముఖుల్ని అపమృత్యుదోషం ఏర్పడుతుందన్నారు. గతంలో తాను చాలా మందికి ఇదే విషయాన్ని చెప్పానని.. అదే నిజమవుతోందన్నారు. శాస్త్రము ఎప్పుడు తప్పుకాదని.. ఇంకా ఇలా ఎన్ని చూడాల్సి వస్తుందో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరణాలు మాత్రమే కాదు కోర్టు కేసులు కూడా ఎదుర్కొనే పరిస్థితి రావచ్చొన్నారు. ఉదాహరణగా కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌ను వెంటాడుతున్న కేసుల విషయాన్ని ప్రస్తావించారు.అలాగేఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు చేసిన వ్యాఖ్యలు, నిర్ణయాలతో అలజడి రేగవచ్చన్నారు. ఉదాహరణకు మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరితల పేర్లను ప్రస్తావించారు. ఈ ముగ్గురి పేర్లు ఎస్‌తోనే ప్రారంభమవుతాయి. బొత్స విషయానికి వస్తే.. ఏపీ రాజధాని విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో కొత్త వివాదం మొదలైన సంగతి తెలిసిందే. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నారు.. ఆయన కూడా తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం వ్యవహారం కలకలం రేపింది.ఇక మేకతోటి సుచరిత విషయానికి వస్తే.. ఆమె పల్నాడు ప్రాంతంలో రాజకీయ దాడులపై టీడీపీ నుంచి విమర్శల్ని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కోడెల మరణం, టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులంటూ టార్గెట్ అయ్యారు. అంతేకాదు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా గతంలో కొన్ని చిన్న, చిన్న వివాదాలతో ఇబ్బంది పడ్డారు. తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనం, అమరావతిలో టీటీడీ క్యాంప్ ఆఫీస్, తర్వాత అన్యమత ప్రచారం వంటి అంశాలు కాస్త ఇరుకున పెట్టాయి. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆతహత్య చేసుకున్న శ్రీనివాసరెడ్డి పేరు కూడా ఎస్‌తోనే ప్రారంభమవుతుందంటున్నారు.మరోవైపు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయంగా, పాలనాపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారని.. నవంబర్ ఐదు తర్వాత ఆయనకు అనుకూల పరిస్థితులు ఉంటాయన్నారు. కాబట్టి ఈ నాలుగైదు అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు జాగ్రత్తగా ఉంటే మంచిదని హెచ్చరిస్తున్నారు