కాంగ్రెస్ విజయం ఖాయం
సూర్యాపేట
రాష్ట్రం మొత్తం హుజూర్ నగర్ వైపే చూస్తున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్, నల్గొండ యం.పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం నాడు సూర్యాపేట జిల్లా నేరేడు చర్ల లో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో అయన పాల్గొన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి 30 వేల మెజార్టీ తో
గెలుపొందుతారని జ్యోస్యం చెప్పారు. తెలంగాణ ఉద్యమం లో పోరాడిన వారికి టికెట్ ఇవ్వకుండా ఆంధ్ర వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారని విమర్శించారు. తెలంగాణ లో ఆంధ్ర డి.యస్.పి ఆంధ్ర సి.ఐ.. యస్.ఐ లు ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. రైతు రుణ మాఫీ కావాలంటే ఉప ఎన్నికల్లో హస్తం గుర్తు కు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి తెరాస ప్రభుత్వానికి బుద్ధి
చెప్పాలన్నారు. తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి,గిరిజనులకు ముస్లిం లకు 12% రిజర్వాషన్ లు అమలు ,నిరుద్యోగ భృతి,ఇంటి కో ఉద్యోగం, రైతు రుణ మాఫీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో 23 లక్షల 75 వేల రైతులకు రైతుబంధు పధకం రాలేదని అన్నారు. మంత్రులు
ఉప ఎన్నిక ఉన్నందున హుజూర్ నగర్ నియోజక వర్గం లో పర్యటన చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో అందరికి ఇండ్లు,పించేన్లు వచ్చాయని అన్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం ఆరు ఏండ్ల కాలం లో రెండు పడకల ఇండ్లు 8,500 లు మంజూరు చేస్తే 500 ఇండ్లు కూడా పేదలకు
రాలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది అని రానున్న ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు.