YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వం రద్దు 

Highlights

  • 11 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేల పై సస్పెన్షన్ వేటు 
  • మండలిలో  ఆకుల లలితలపై వేటు 
  • స్వామి గౌడ్ స్థానంలో నేతి..
  • కాంగ్రెసు తీరుపై కేసీఆర్  తీవ్ర ఆగ్రహం
కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వం రద్దు 

కాంగ్రెసు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ శాసనసభా సభ్యత్వాలను రద్దు చేయాలని శానససభ నిర్ణయించింది. స్వామి గౌడ్‌పై వారిద్దరు దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కున్నారు.

మంగళవారం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే నిన్నటి ఘటనపై స్పీకర్ మధుసూదనాచారి ఓ ప్రకటన చేశారు. ఆ ఘటన తనను తీవ్రమైన మనస్తాపానికి గురి చేసిందని అన్నారు. సంఘటన దురదృష్టకరమని అన్నారు. ఆ తర్వాత హరీష్ రావు తీర్మానాలను ప్రతిపాదించగా సభ ఆమోదించింది.

దీనితో కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేత కె. జానా రెడ్డి సహా 11 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలను స్పీకర్ ఈ సభా సమావేశాల వరకు సస్పెండ్ చేశారు. జీవన్ రెడ్డి, డికె అరుణ, వంశీచందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, మాధవరెడ్డి, చిన్నారెడ్డి, గీతారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పద్మావతి, రామ్మోహన్ రెడ్డిలు ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌కు గురయ్యారు.  సస్పెండ్ చేసిన తర్వాత కాంగ్రెసు సభ్యులు సభలోనే ఉన్నారు. దీంతో సభ నుంచి వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. బహిష్కరణకు, సస్పెన్షన్‌కు గురైన సభ్యులు వెళ్లిపోవాలని ఆయన సూచింంచారు. సోమవారం జరిగిన ఘటన దుర్మార్గమైందని అన్నారు.కాగా   స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కాంగ్రెసు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా కాంగ్రెసు శాసనసమండలి సభ్యులు కోమటిరెడ్డి వెంకటెర్డి, ఆకుల లలితలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శాసన మండలిలో డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి తీర్మానం ప్రతిపాదించారు. స్వామి గౌడ్ స్థానంలో మండలి సమావేశాలకు నేతి విద్యాసాగర్ రావు అధ్యక్షత వహించారు.

Related Posts