YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నాగం..ఆగం అయిపోయారా...

నాగం..ఆగం అయిపోయారా...

మహబూబ్ నగర్ : నాగం జనార్థన్ రెడ్డి ఈ పేరు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరికీ తెలియంది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ పేరొందిన నేత. కాని ఇప్పుడు ఆయన పేరు వినిపించడం లేదు. మనిషి కనిపించడం లేదు. మరి

నాగంకు ఏమైంది. ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమయ్యిందనే సందేహాలు అన్ని ఇన్నీ కావు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో టీడీపీ లో ఉన్న నాగంకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయన కోలుకోలేదనే చెప్పాలి. ఇంతకీ ఇప్పుడు నాగం భవిష్యత్తు ఏమిటి….? రాజకీయాల్లో ఆయన మనుగడ కొనసాగేనా ఓ సారి పరిశీలిద్దాం.నాగం మే

22, 1948లో మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు మండలం నాగపూర్ గ్రామంలో జన్మించారు. 71 సంవత్సరాల వయస్సు ఉన్న నాగం జనార్థన్ రెడ్డి ఊరుపేరే ఇంటిపేరైంది. మహబూబ్

నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5 సార్లు గెలుపొందారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పలు మంత్రిపదవులు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి,

పదవికి రాజీనామా చేసి సొంతంగా తెలంగాణ నగరా పార్టీని స్థాపించారు. 2012 ఉప ఎన్నికలలో ఇండిపెండెంటుగా బరిలోకి దిగి మరో సారి విజయం సాధించారు.తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం

ఉవ్వెత్తున జరుగుతున్న ఉద్యమం సమయంలో కేసీఆర్ టీడీపీ తెలంగాణ నాయకులపై దుమ్మెత్తిపోశారు. రాజీ నామాలు చేసి మాతో కలిసి రావాలని లేకపోతే వారు ద్రోహుల కిందే లెక్కంటూ

విమర్శించారు. ఇదే సమయంలో ఉద్యమం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో టీడీపీ తెలంగాణ నేతల బృందం ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లింది. అదే సమయంలో ఉద్యమంలో ఉన్న విద్యార్థులు

టీడీపీ నాయకులను బంతాట ఆడుకున్నారు.అందులో ముఖ్యంగా నాగం జనార్థన్ రెడ్డి కారును ధ్వంసం చేయడంతో పాటు తీవ్రంగా కొట్టారు. ఇక్కడే ఆయన కధ మలుపు తిరిగింది. ఈ ఘటన

తర్వాత నాగం కొంతకాలం స్థబ్ధుగా ఉండిపోయారు. ఆ తర్వాత ఏం చేయాలో కొంతకాలం మదనపడి చివరికి టీడీపీ కి గుడ్ బై చెప్పి నగరాను స్థాపించారు.వైద్య విద్య పూర్తయ్యాక 1976లో నాగర్

కర్నూల్ లో వైద్యునిగా ప్రాక్టీసు మొదలు పెట్టారు నాగం జనార్థన్ రెడ్డి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 1983లో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేశారు. 52 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మళ్ళీ

1985లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. 1989 లో తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పొటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ 1994 లో తెలుగుదేశం పార్టీ

నుంచి టికెట్ సంపాదించి విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా 5 సార్లు నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు

చేయడం, పార్టీ అధ్యక్షుడినే విమర్శించడం ద్వారా పార్టీ నుంచి 2011లో బహిష్కరణకు గురయ్యారు నాగం జనార్థన్ రెడ్డి. రాష్ట్ర మంత్రివర్గంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్, అటవీ, వైద్య ఆరోగ్య, పౌర

సరఫరా, పంచాయితీ రాజ్ శాఖ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పోలీట్ బ్యూరో సభ్యునిగా కూడా పనిచేశారు.అనంతరం ఆయన రాజకీయ ప్రయాణం బీజేపీతో కొంతకాలం

కొనసాగింది. బీజేపీలోనూ ఇమ‌డ‌లేక‌పోయిన నాగం జనార్థన్ రెడ్డి బీజేపీ జాతీయ పెద్ద‌ల‌ను, అమిత్ షాను కూడా క‌లిసి త‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అయినా ఆయ‌న్ను ప‌ట్టించుకున్న వారు లేరు.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నాగం బీజేపీకి కూడా రాజీనామా చేశారు. బీజేపీకి గుడ్ బై చెప్పకముందే నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని విస్రృత ప్రచారం జరిగింది. దీంతో అప్పటికి

పాలమూరులో ఉన్న కాంగ్రెస్ నేతలు నాగం జనార్థన్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా అప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ నాయకురాలైన డీకే అరుణ వర్గం నాగం రాకను తీవ్రంగా

వ్యతిరేకించారు. జైపాల్ రెడ్డి నాగం కాంగ్రెస్ లోకి వస్తే ఏ మేరకు లాభం ఉంటుందో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వివరించడంతో నాగం చేరికకు రాహుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాగం

జనార్థన్ రెడ్డి పార్టీలోకి వస్తే తాము పార్టీ వీడిపోతామని డీకే వర్గం బహిరంగంగానేప్రకటించింది. అయినా అధిష్టానం నాగం చేరికకే మొగ్గుచూపింది. దీంతో కొంత కాలం తర్వాత డీకే అరుణ బీజేపీ

కండువా కప్పుకున్నారు.వయస్సు రీత్యా నాగం 71 సంవత్సరాలు. ఈ వయస్సులో బీజేపీలో ఉంటే ఏం పదవులు రావని తెలిసి కాంగ్రెస్ లోకి వచ్చి మంచిపని చేసుకున్నానని ఆయనకు ఆయనే

సమర్థించుకున్నారు. కాని కాంగ్రెస్ లో చేరినా ఆయనకు మాత్రం ఎటువంటి ప్రాముఖ్యత లేదనే చెప్పాలి. అక్కడ ఒక్క సీటు ఉంటే వందలాది మంది పోటీ పడతారు. బెల్లం ముక్కకు ఈగలెక్కవా అన్న

చందంగా ఆ పార్టీ పరిస్థితి ఉంటుంది. అందులోనూ రెండు పార్టీలు మారి వచ్చిన నాగంకు ఎలా ఉంటుందో అర్థంచేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఆ పార్టీలో ఉన్నా ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే

కాంగ్రెస్ అధికారంలోనూ లేదు. రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తుందో లేదో తెలియని పరిస్థితి. పోని ఇంకా ఏమైనా పార్టీలున్నాయా మారడానికి అంటే ఇప్పుడైతే ఆయనకు అన్ని

దారులుమూసుకుపోయాయి. కేవలం టి.ఆర్.ఎస్ పార్టీ ఒక్కటే ఉన్నా అందులో ఆయనకు వెళ్లడం ఇష్టం లేదు. దీంతో నాగం జరిగేది జరుగుతుందన్నట్లు మౌనంగా ఉండిపోయారు. ఓ నాడు వెలుగు

వెలిగిన నాగం నేటి పరిస్థితిని చూసి ఆయన అభిమానులు, అనుచరులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.

Related Posts