కోహ్లీ తప్పుతో తొలి ఓటమి
ముంబై,
దక్షిణాఫ్రికాతో ఆదివారం రాత్రి జరిగిన మూడో టీ20లో భారత్ ఓటమికి కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ నిర్ణయమే కారణమా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగగా.. టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వాస్తవానికి శనివారం రాత్రి, ఆదివారం ఉదయం బెంగళూరులో
వర్షం పడింది. దీంతో.. పిచ్‌పై ఉన్న తేమ కారణంగా.. బంతి నెమ్మదిగా ఆగి బ్యాట్‌పైకి వస్తుంది. ఆ సమయంలో బ్యాట్స్‌మెన్ హిట్టింగ్‌కి ప్రయత్నించినా.. ఆశించిన విధంగా షాట్‌ని కనెక్ట్ చేయలేకపోవచ్చు. కానీ.. విరాట్ కోహ్లీ సాహసోపేతంగా తొలుత బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు.పిచ్‌ని సద్వినియోగం చేసుకున్న దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగిపోయారు. దీంతో.. భారత జట్టులో శిఖర్ ధావన్ (36) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. ఈ స్టేడియంలో ఘనమైన రికార్డ్ ఉన్న విరాట్ కోహ్లీ కూడా 15 బంతులాడినా కనీసం ఒక్క బౌండరీ కూడా సాధించలేకపోయాడంటే పిచ్ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 134/9కి పరిమితమవగా.. లక్ష్యాన్ని మరో 19 బంతులు మిగిలి ఉండగానే
140/1తో దక్షిణాఫ్రికా ఛేదించేసింది. దీంతో.. మూడు టీ20ల సిరీస్ 1-1తో ముగిసింది. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో.. జట్టుకి ఒత్తిడిని పరిచయం చేయాలనే ఆలోచనతో తాను ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నట్లు కోహ్లీ చెప్పుకోచ్చాడు. వాస్తవానికి టీ20 టీమ్.. బుమ్రా, భువీ, చాహల్, కుల్దీప్ లేకపోవడంతో అనుభవలేమితో ఉంది. ఈ సమయంలో ప్రయోగాలు చేయడం ద్వారా ఓటమితో యువ బౌలర్లు మరింత కుంగుబాటుకి లోనయ్యే ప్రమాదం ఉంది. మొత్తంగా.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మ్యాచ్ గమనాన్ని అర్థం చేసుకోవడంలో టీమిండియా విఫలమైందని ఓటమి తర్వాత కెప్టెన్ కోహ్లీ అంగీకరించాడు.