దేవరుప్పలలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన
జనగామ
జనగామ జిల్లా దేవరుప్పుల లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం పర్యటించారు. సింగరాజుపల్లి గ్రామంలో వాలీబాల్, షెటిల్ కోర్టును ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జెడ్పి చైర్మన్ సంపత్ రెడ్డి, వైస్ ఎంపిపి కె.విజయ్, సర్పంచ్ జి.మల్లేష్, స్థానిక యువకులు పాల్గొన్నారు. తరువాత అయన దేవరుప్పులలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. ఆదర్శ గ్రామాలకు గుర్తింపు ఇచ్చి, అభివృద్ధిలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. మన ఇంటిని, మన ఊరిని మనమే బాగు చేసుకోవాలన్నారు. అనుమతి ఉంటేనే చెట్లను నరకాలన్నారు. ఇంటి ముందు చెత్తవేస్తే జరిమానా విధించేలా పంచాయతీలు తీర్మానం చేయాలన్నారు. ప్రతి ఒక్కరు సొంత గ్రామంలో శ్రమదానం చేయాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందజేస్తున్నారని మంత్రి తెలిపారు.