YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

సామాజిక కోణంలో బీజేపీ - కేసీఆర్ చెక్ పెట్టేందుకే రంగంలోకి చెన్నమనేని

సామాజిక కోణంలో బీజేపీ - కేసీఆర్ చెక్ పెట్టేందుకే రంగంలోకి చెన్నమనేని

సామాజిక కోణంలో బీజేపీ - కేసీఆర్ చెక్ పెట్టేందుకే రంగంలోకి చెన్నమనేని
కరీంనగర్,
తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతోంది….. కేంద్రం నుంచి ఎవరో చక్రం తిప్పుతున్నట్లున్నారు….. ఇంతకీ ఏం జరుగుతుంది…. ఇదే ఇప్పుడు తెలంగాణ భారతీయ జనతా పార్టీలో చర్చ. బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ రీ ఎంట్రీ ఇచ్చారు. దీంతో నేతల్లో మరో ఆలోచన ఆయన మళ్లీ ఎందుకొచ్చారు. ఏం చేస్తారు. తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతోందనే పుకార్లు షికార్లవుతున్నాయి. ఇంతకీ చెన్నమనేని రీ ఎంట్రీ ఎందుకిచ్చినట్లు…?చెన్నమనేని విద్యాసాగర్ రావు…… తెలుగురాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. బీజేపీలో సీనియర్ నేత, మహారాష్ట్రకు మొన్నటి దాకా గవర్నర్ గా వ్యవహరించిన చెన్నమనేని విద్యాసాగర్ రావు అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కారు. గవర్నర్ పదవీ కాలం ముగిసిన వెంటనే తిరిగి హైదరాబాద్ వచ్చేసిన విద్యాసాగర్ రావు ఇటీవలే బీజేపీలో మళ్ళీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. రాజకీయాల్లో ఇక యమా యాక్టీవ్ గా ఉంటానని కూడా సెలవిచ్చారు.ఇప్పుడు అందరి ప్రశ్నా అదే. రానున్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలున్నాయి. విద్యాసాగర్ రావును బీజేపీ అధ్యక్షుడిగా చేస్తారా? అన్న చర్చ కూడా జరగుతుంది. కొందరు అవునూ అంటుంటే మరికొందరు మాత్రం కాదంటున్నారు. కాని కేంద్రం నుంచి మాత్రం తెలంగాణలో మాత్రం పావులు కదులుతున్నాయన్నది సత్యం. విద్యాసాగర్ రావుకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. విద్యాసాగర్ రావు వయస్సు 77 ఏళ్లు. బీజేపీలో 70 ఏళ్లు దాటితే ఎటువంటి పదవులు ఉండవు.ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖులలో ఒకరు విద్యాసాగర్ రావు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించి న్యాయవాద వృత్తి చేపట్టిన విద్యాసాగర్ రావు 1980లో తొలిసారిగా కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1985లో మెట్‌పల్లి శాసనసభ నియోజకవర్గంలో తొలిసారి గెలుపొంది రాష్ట్ర శాసనసభలో ఆడుగుపెట్టారు. మొత్తం 3 సార్లు శాసనసభ్యుడిగాను, రెండు సార్లు లోకసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అటల్ బిహారీ వాజపేయి నేతృతంలోని ఎన్.డి.ఏ.ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1977లో కరీంనగర్ జిల్లా జనతా పార్టీ అధ్యక్షుడిగానూ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగాను వ్యవహరించారు. స్వశక్తితో ఎదిగి రాజకీయాలలో రాణించారు. 2004లో, 2006 ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనంతో ఓడిపోయారు.విద్యాసాగర్ రావుకు అటు కేంద్రంలో…. ఇటు రాష్ట్రంలో విశేష రాజకీయ అనుభవం ఉంది. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెంఢా ఎగరేయాలనేది సంకల్పం. ఇందుకోసం జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలు మొదలు పెట్టారని తెలుస్తోంది. ఈ కోణంలోనే మహారాష్ట్రలో విద్యాసాగర్ గవర్నర్ పదవీ కాలం ముగియగానే ఆయన సేవలను తెలంగాణలో వినియోగించుకోవాలని పార్టీ భావించింది. దీంతో విద్యాసాగర్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే.

Related Posts