YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జిల్లాను వణికిస్తున్న డెంగ్యూ - పడిపోతున్న ప్లేట్ లెట్స్

జిల్లాను వణికిస్తున్న డెంగ్యూ - పడిపోతున్న ప్లేట్ లెట్స్

జిల్లాను వణికిస్తున్న డెంగ్యూ - పడిపోతున్న ప్లేట్ లెట్స్
వరంగల్
డెంగీ.. ఉభయ జిల్లాలను వణికిస్తోంది. జ్వరం వచ్చిందంటే చాలు రోగితోపాటు బంధువులూ భయాందోళనలకు గురవుతున్నారు. ప్లేట్‌లెట్లు పడిపోతున్నాయనే భయం ఎక్కువవుతోంది. పరిస్థితి ఎలా ఉన్నా కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యం చేసే నిర్వాకాలు గుబులు పుట్టిస్తున్నాయి. అత్యవసరంగా రోగికి ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాల్సి వస్తే తప్పనిసరిగా ఎస్‌డీపీ విధానం ద్వారా రక్త ఫలకికల్ని సేకరించి ఎక్కించాల్సి ఉంటుంది. లేకుంటే రోగి పరిస్థితి ఆందోళనకర స్థితికి చేరుతుంది. 18-15 వేలకు రక్త ఫలకాలు పడిపోతున్నాయంటే రక్త స్రావం జరిగే అవకాశం ఉందని వైద్యులు ఫలకికలు ఎక్కించాలని సూచిస్తున్నారు. అయితే కొందరికి ఒక దఫా రక్త ఫలకికలు ఎక్కించిన తర్వాత కూడా పురోగతి కనిపించదు. అలాంటప్పుడు విడతలవారీగా ఎక్కిస్తూనే ఉండాలి. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే సాధారణ, మధ్య తరగతి ప్రజలు ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కోక తప్పని స్థితి. ఒక్క దఫా రక్త ఫలకికలు సేకరిస్తేనే రూ.16 వేలు ఖర్చవుతుంది. ఇక ఆసుపత్రి బిల్లు, మందుల వాత కలిసి రోగి తరపు వారికి తడిసి మోపెడవుతుంది.తగ్గుతున్నాయనగానే గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇటీవల ఈ విధానం యధేచ్ఛగా సాగుతోంది. జ్వరం వచ్చిందంటే ఇప్పుడు అందరి దృష్టి రక్త ఫలకికల మీదికే వెళుతోంది. అవి చాలా తక్కువకు పడిపోతే ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుందన్న బెంగ జనాన్ని హడలెత్తిస్తోంది. వైద్య నిపుణులు మాత్రం  అన్ని సందర్భాల్లో ఇది సరికాదని చెబుతున్నారు. జర్వం వస్తే కనీసం ఐదు రోజులు మనిషిని డీలా చేస్తుంది. అయితే జ్వరం తగ్గాక కూడా మరో ముప్పు పొంచి చూస్తోంది. అదే రక్తఫలకికల తగ్గుదల.. వాస్తవానికి అవి తగ్గడం, పెరగడం అన్నది మానవ శరీరంలో తరచూ జరిగే ప్రక్రియే అయినప్పటికీ జ్వరం వచ్చినప్పుడే నహజంగా ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌పై దృష్టి పెట్టడం సర్వసాధారణంగా మారింది. ఒక చిన్న చాక్లెట్‌ తిన్నా వాటిలో కాస్తంత పెరుగుదల కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే రక్తఫలకికల లెక్కింపుపై ప్రామాణికత లేకపోవడమే ఇప్పుడు సమస్యగా మారుతోంది. రక్తంలో వాటి సంఖ్యను ఒక నిర్దారణ కేంద్రంలో పరీక్షించి ఒక అరగంట వ్యవధిలో మరో రక్త నిర్దారణ కేంద్రంలో పరీక్షిస్తే మొదటి లెక్కలో వ్యత్యాసం కనిపించడం పరిపాటి. ఆరోగ్యంగా ఉన్న మనిషిలో 2.5 లక్షల నుంచి ఆపైనే రక్త ఫలకికల సంఖ్య ఉంటుంది. ఈ లెక్క లక్ష వరకు పడిపోయినా ఆరోగ్య స్థితిలో పెద్దగా మార్పేమీ కనిపించదు. 50 వేల కంటే తగ్గుదల ఉంటేనే క్రమంగా నీరసించడం కనిపిస్తుంది. ఆ సంఖ్య ప్రమాదకర స్థాయిలో పడిపోతుంటే రోగిలో బాహ్య లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. పళ్ల చిగుళ్లలో రక్తం కారడం, మలం, మూత్రంలో రక్తం రావడం, ఒంటిపై ఎరుపు మచ్చలు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితిని ప్రమాద స్థితికి సంకేతంగా వైద్యులు భావిస్తారు. ఈక్రమంలో బాధితుడికి ఆరోగ్యం అత్యల్పంగా క్షీణిస్తేనే ప్రత్యేకంగా రక్త ఫలకికలు ఎక్కించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. వీటిని దాత నుంచే సేకరించాల్సి ఉంటుంది. శరీరంలోకి ఎక్కించిన తర్వాత క్రమంగా పెరుగుతాయని వైద్యుల సలహా. ఇందులోనే మరో సమస్య ఉంది. 

Related Posts