YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పని ఒత్తిడిలో తెలంగాణ అధికారులు

పని ఒత్తిడిలో తెలంగాణ అధికారులు

పని ఒత్తిడిలో తెలంగాణ అధికారులు
హైద్రాబాద్,
ఓ వైపు రిపేర్లు.. దాని నుంచి వచ్చే దుమ్ము  ధూళి. ఇరుకిరుకు గదులు.. ఎక్కడపడితే అక్కడే వ్యర్థాలు. ఇంకో వైపు హుస్సేన్సాగర్, నాలా.. ముక్కుపుటాలదిరే కంపు. వెరసి, బీఆర్కే భవన్ ఉద్యోగులను అనారోగ్య సమస్యలు పట్టుకున్నాయి. 40 శాతం మంది జ్వరాలు, శ్వాస సంబంధ సమస్యలు, గొంతు ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారు. అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో సెలవులు కూడా లేకపోవడంతో అనారోగ్యంతోనే పనిచేస్తున్నారు. రిపేర్లకు ఇంకా 15 రోజుల టైం పట్టే అవకాశాలుండడంతో ఉద్యోగులు ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. పాత సెక్రటేరియట్లో రెగ్యులర్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు కలిపి 2 వేల మంది దాకా పనిచేసేవారు. షిఫ్టింగ్ టైంలో కొన్ని శాఖలను వేరే చోటుకు తరలించడంతో, ప్రస్తుతం బీఆర్కే భవన్లో 1500 మంది దాకా డ్యూటీ చేస్తున్నారు.నిజానికి బీఆర్కే భవన్లో పనిచేయడంపై ఉద్యోగులు ముందు నుంచీ వ్యతిరేకిస్తున్నారు. అధికారులు, ఉన్నతాధికారులూ వద్దంటూనే ఉన్నారు. బిల్డింగ్లో వెంటిలేషన్ లేకపోవడం, ఇరుగ్గా ఉండడం, హుస్సేన్సాగర్, నాలాలు పక్కనే ఉండి చెడు వాసనలు రావడం, తెలుగు తల్లి ఫ్లై ఓవర్పై వాహనాల శబ్దం ఎక్కువగా ఉండడం, పార్కింగ్ లేకపోవడం వంటి కారణాలతో బీఆర్కే భవన్లో డ్యూటీ చేసేందుకు వాళ్లు ఇష్టపడలేదు. కానీ, వేరే ప్రత్యామ్నాయం లేకపోవడం, అక్కడే పనిచేయాలని ప్రభుత్వం, సీఎస్ ఆదేశించడంతో వెళ్లక తప్పలేదంటున్నారు ఉద్యోగులు. అక్కడికి వెళ్లాక కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయలేదని వాపోతున్నారు. ఒక్కటే లిఫ్ట్తో క్యూలో నిలబడి వెళ్లాల్సి వస్తోందంటున్నారు. క్యాంటీన్ కూడా సరిగ్గా లేదని, చీకట్లోనే తినాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. అంతేగాకుండా రిపేర్లు చేసిన సామగ్రిని వివిధ ఫ్లోర్ల కారిడార్లలోనే వేస్తున్నారని, దాని వల్ల మరింత ఇరుకుగా ఉంటోందని వాపోతున్నారు. ఏడాదిలో కొత్త సెక్రటేరియట్ పూర్తవుతుందని సర్కారు చెబుతున్నా, మరో ఏడాదిన్నర, రెండేళ్లదాకా పట్టే అవకాశం ఉందని, అప్పటిదాకా బీఆర్కేలో ఎలా పనిచేయాలని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిపేర్లు చేస్తున్న వ్యర్థాలను జీహెచ్ఎంసీ తీసుకెళ్లకపోవడంతో అవన్నీ బీఆర్కే ఆవరణలోనే గుట్టలుగా పేరుకుపోతున్నాయి. గత నెల 8న ప్రారంభమైన షిఫ్టింగ్ నెమ్మదిగా సాగుతోంది. ఇప్పటికి 70 శాతం పూర్తయిందని, మిగతా షిఫ్టింగ్ త్వరలోనే పూర్తవుతుందని అసెంబ్లీలో ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు.

Related Posts