మహాజాతర కు భారీ ఏర్పాట్లు
వరంగల్,
మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు సమయం దగ్గర పడుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జాతర జరుగనుంది. దేశం నలుమూలల నుంచి సుమారు కోటి మంది భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు ఇక్కడికే వచ్చే అవకాశం ఉందని అంచనా. జాతరకు ఇంకా నాలుగు నెలల సమయం కూడా లేదు. అయినా ఇప్పటివరకు మేడారంలో అభివృద్ధి పనులేమీ మొదలుకాలేదు. జాతర శాశ్వత అభివృద్ధి పనుల కోసం రూ. 200 కోట్లు కేటాయిస్తామని 2018లో సీఎం కేసీఆర్ స్వయంగా తల్లుల గద్దెల వద్ద చేసిన వాగ్దానం అమలుకు నోచుకోలేదు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఏడాదిన్నర అవుతున్నా నేటికీ నిధులు విడుదల చేయలేదు.ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలో ఏటా 9 ప్రభుత్వ శాఖలు అభివృద్ధి పనులు చేపడతాయి. రూ. 200 కోట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో 2018 మార్చి నెలలోనే ఆయా శాఖల అధికారులు తమ శాఖ తరపున చేపట్టబోయే శాశ్వత అభివృద్ధి పనుల కోసం రూ. 184 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి సీఎం కార్యాలయానికి పంపించారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడారం మహాజాతర జరగనుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 7న హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్ మేడారం మహాజాతరపై సమీక్ష జరిపారు. ములుగు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో పి.చక్రధర్‌రావు హాజరయ్యారు. 2020 ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతరకు సంబంధించి ముందుగా భూసేకరణ జరపడానికి రూ. 10 కోట్లు మంజూరు చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. మేడారం పరిసర ప్రాంతాల్లో అవసరమైన భూసేకరణ కోసం ప్రభుత్వ భూమి? ప్రైవేట్‌భూమి? ఎంత ఉందో లెక్క తీసి నివేదిక పంపించాలని మంత్రులు ఆదేశించారు. దీంతో ప్రస్తుతం మేడారంలో అధికారులు భూ సేకరణ లెక్కలు వేసే పనిలో పడ్డారు. మరోవైపు మహాజాతరకు కేవలం 4 నెలల గడువు మాత్రమే ఉంది. నేటికీ సీఎం హామీ మేరకు నిధులు మంజూరు చేయకపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతర సమయంలో హడావుడి పనులు కాకుండా నిధులు ముందుగా మంజూరు చేసి టెండర్లు పిలిచి శాశ్వత అభివృద్ధి పనులు ప్రారంభిస్తే బాగుంటుందనిఅంటున్నారుతాడ్వాయి‒నార్లా పూర్ రహదారిపై 8 డిప్స్ , 5మూల మలుపులు ఉన్నాయి. జాతరసమయంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ రహదారిని అభివృద్ధిచేసి మూల మలుపులు లేకుండా చేయాలి.ప్రైవేట్ వెహికిల్స్ వెళ్లే పస్రాభూపాలపల్లి రోడ్డుకొన్నిచోట్ల చాలా తక్కువ విస్తీర్ణంలో ఉంది.అదేవిధంగా మోరీలు కూడా చాలా పాతవి.కాటారం‒భూపాలపల్లి మధ్యలో మిగిలిన 6.1కి.మీ దూరం రోడ్డును డబుల్ రోడ్డు గామార్చాలి. మేడారం నుం చి ఊరట్టం వరకు రోడ్డు అభివృద్ధి చేయాలి.