YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పౌష్టికాహారం సరఫరాపై ఇంటింటి తనఖీ

పౌష్టికాహారం సరఫరాపై ఇంటింటి తనఖీ

పౌష్టికాహారం సరఫరాపై ఇంటింటి తనఖీ
వనపర్తి 
మండల కేంద్రమైన గోపాల్ పేట లో సోమవారం అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు ఇచ్చే పౌష్టికాహారం పై ఇంటింటికి తనిఖీ నిర్వహించారు. ఈ తనకి లో బి ఆర్ పి . మౌనిక. వి.ఆర్ పి. చంద్రకళ లు పాల్గొని కేంద్రాలలో చదువుతున్న చిన్నారుల ఇండ్లను తనిఖీ చేస్తూ అంగన్వాడి నుంచి ఇచ్చే గుడ్లు పౌష్టికాహారం పౌడర్ పై తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్య వార్త బ్యూరో తో వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే గోపాల్ పేట లోని ఏడు అంగన్వాడీ కేంద్రాలలో తనిఖీలు నిర్వహిస్తున్నామని వారన్నారు. ఒక్కొక్క కేంద్రంలో ఉన్న చిన్నారుల జాబితాతో ఇల్లిల్లు తిరిగి వివరాలను అడిగి తెలుసుకుంటున్న మని వారన్నారు, అదేవిధంగా చిన్నారుల ఆరోగ్యంపై మరియు వారి బరువుల వివరాలను గురించి అడిగి తెలుసుకుని నమోదు చేయడం వంటి సంఘటనలు జరుగుతున్నాయని వారు వివరించారు. ఇప్పటివరకు చేసిన తనిఖీలో ఏలాంటి పొరపాట్లు లేవని కేంద్రాల నుంచి చిన్నారులకు అందే గుడ్లు, పౌష్టికాహారం పౌడర్ సక్రమంగా అందుతున్నాయని వారన్నారు.

Related Posts