పాడి పశువులను ఆరోగ్యంగా ఉంచుకోవాలి డి డి వరప్రసాద్
పశువులకు గాలి కుంటు టీకాలు వేయించండి నోడల్ అధికారి వెంకట రమణ
అదోని
పాడి పశువులకు గాలి కుంటు టీకాలు వేయించుకోవాలని బడినేహాలూ గ్రామస్తులకు కోరారు. పాడి పశువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ ఇల్లు ఆనందముగా వుంటుంది అని ఆదోని డి డి వరప్రసాద్ పేర్కొన్నారు.పశువులకు ఎద్దులకు గాలి కుంటు టీకాలు వేశారు.దూడలకు నట్టల మందు కడుపులో తాగించారు. సోమ వారం బదినేహాలు గ్రామంలో పశు వైద్య శాలను సందర్శించి తనిఖీ చేశారు. పలు రికార్డ్ బుక్ లని పరిశీలించారు.రైతులకు అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని పశు వైద్యులు లను సూచించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పాడి పశువులను పెంచుకోవాలని కోరారు. ఒక పాడి పశువు ఒక ఏకరతో సమానమని తెలిపారు. పాడి పశువులను పెంచు కుంటే మన ఇంటి అవసరాలను,సంపదను పెంపొందిస్తుంది అని సూచించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి వెంకట రమణ,పశు వైద్యులు రాజశేఖర్,దినకర్, పశు సిబ్బంది మొహమ్మద్, రహీమ్ బాషా, నవీన్ కుమార్ ముక్తార్ భాష, రవి గ్రామస్తులు పాల్గొన్నారు.