అర్బన్ పార్క్ ను పరిశీలించిన ఎంపీ
వరంగల్ అర్బన్,
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్ పేర్కొన్నారు. తదనుగుణంగా పట్టణీకరణ పెరుగుతున్నదని తెలిపారు. పట్టణ ప్రజలకు మంచి గాలిని, పచ్చని వాతావరణాన్ని అందించుటకై ముఖ్యమంత్రి కెసిఆర్ అర్బన్ పార్కులకు శ్రీకారం చేట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని స్పూర్తిగా తీసుకొని రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో అర్బన్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, సి.సి.ఎఫ్. ఎం.జె. అక్టర్ లతో కలిసి ఖాజిపేట మండలం రాంపుర్ లో నిర్మించనున్న అర్బన్ పార్కు స్థలాన్ని, ఎల్కతుర్తి మండల కేంద్రంలో అభివృద్ధి చేస్తున్న అర్బన్ పార్కును పరిశీలించారు. రాంపూర్ లో కూడా ఆధ్వర్యంలో ఉన్న 86 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పనులను చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ తెలిపారు. అందులో 10 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ స్కేపింగ్ తో అర్బన్ పార్కు రెండు ఎకరాల్లో మియావాకి ఫారెస్ట్,10 ఎకరాలంలో బ్లాక్ ప్లాంటేషన్ చేపట్టుటకు భూమి లెవలింగ్ పనులను ప్రారంభించనట్లు తెలిపారు. ఎల్కతుర్తి రిజర్వ్ ఫారెస్ట పరిధిలో దాదాపు 70 ఉకరాల వీస్తీర్ణంలో చేపట్టిన అర్బన్ పార్కపనులలో 80 శాతం పూర్తి అయినట్లు సి.సి.ఎఫ్ ఎం.జె.అర్బన్ తెలిపారు. ఈ అర్బన్ పార్కును సందర్శించే ప్రజల సౌరకర్యార్ధం వాకింగ్ ట్రాక్ లరు ఓపెన్ .జిమం ను కేఫ్ టేరియాను, చిల్డ్రన్ పార్కును ఏర్పటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అర్బన్ సాక్రును విహార
కేంద్రాంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఈ సర్యటనలో మున్సిపల్ కమీషనర్ ఎన్.రవికూమార్, కుడా ప్లానింగ్ అధికారి, ఇ.అజిత్ రెడ్డి, ఆర్డిఓ-కె,వెంకారెడ్డి డి.ఎఫ్.ఓ.రామలింగం స్ధానిక ప్రజానిధులు,
అధికారులు, తదితరలు పాల్గొన్నారు.