YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పత్తా లేకుండా పోయిన కామెడి కింగ్

పత్తా లేకుండా పోయిన కామెడి కింగ్

ఏలూరు, కొత్తా దేవుడండీ.. కొంగొంత్తా దేవుడండి- అనే రేంజ్‌లో ఏపీ పాలిటిక్స్‌లో ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌త్య‌క్షమై.. ప్ర‌త్యేక శైలిలో పాలిటిక్స్‌ను, మీడియాను త‌న చుట్టూ తిప్పుకొనే కేఏ పాల్ ఉరఫ్ కిలారి ఆనంద్ పాల్ ఇప్పుడు ఎక్క‌డున్నారు? ఏం చేస్తున్నారు? ఆంధ్రాని అమెరికా చేస్తా.. న‌ర‌సాపూరంని.. నైనిటాల్ చేస్తా.. అంటూ ఎన్నిక‌ల స‌మ‌యంలో ధ‌మాయించి డాబులు ప‌లికినా.. కామెడీ పొలిటీషియ‌న్‌గా అంద‌రినీ క‌వ్వించి న‌వ్వించినా.. ఆయ‌న ఓ సెంట్రిక్ పాయింట్‌గా మారారు. ఏపీలో త‌న ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, ప్ర‌జాశాంతి పార్టీ అధికారంలోకి రావ‌డం త‌థ్య‌మ‌ని చెప్పుకున్నారు.అంతేనా.. అస‌లు ఈ పార్టీకి ఓటు వేయ‌క‌పోతే.. ప్ర‌జ‌లే నాశ‌నం అయిపోతారంటూ.. త‌న‌దైన శైలిలో శాపాలు పెట్టిన కేఏ పాల్ ప‌త్తా లేకుండా పోవ‌డం ఓ వ‌ర్గం ప్ర‌జ‌ల‌ను కామెడీకి దూరం చేసింద‌నే వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్నాయి. 2014లో ఒక‌సారి, ఇప్పుడు ఈ ఏడాది ఏప్రిల్ లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ కేఏ పాల్ ఏపీ రాజ‌కీయాల్లో సెంట‌రాఫ్‌ది టాపిక్‌గా మారారు. ల‌క్ష‌ల లక్ష‌ల కోట్లు తెచ్చి.. ఆంధ్రాను అమెరికా చేస్తాన‌న్నా.. రాజ‌కీయాలు నాశ‌నం అయిపోయాయి.. నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రాజ‌కీయాలు చేస్తాన‌ని త‌న‌దైన బాణిలో చెప్పుకొచ్చినా.. మీడియా గొట్టం క‌నిపిస్తే.. చాలు.. గంట‌ల త‌ర‌బ‌డి ఘుమాయించే డైలాగులు వండి వార్చినా.. కేఏ పాల్ శైలే భిన్నం విభిన్నం.ఎన్నిక‌ల‌కు ముందు రావ‌డం, ఎన్నిక‌లు ముగిశాక వెళ్లిపోవ‌డం కేఏ పాల్ కు ఇప్పుడు కొత్త‌కాదు. 2004, 2009, 2014ల‌లోనూ క‌నిపించింది. 2009 ఎన్నిక‌ల్లో అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేశారు. ఇక తాజా ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత త‌న కేండిడేట్ల నామినేష‌న్ ప‌త్రాల‌ను వైసీపీ దొంగిలించింద‌ని అందుకే తాము ఓడిపోయామ‌ని, తాము అధికారంలోకి వ‌స్తే.. జ‌గ‌న్‌ను జైలుకు పంపిస్తామ‌ని ఇలా కామెడీ డైలాగుల‌తో అంద‌రినీ కేఏ పాల్ ఆక‌ట్టుకున్నారు. ఎన్నిక‌ల్లో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థుల పేర్ల‌ను పోలిన అభ్య‌ర్థుల‌కే బీ ఫామ్‌లు ఇచ్చి పెద్ద సంచ‌ల‌న‌మే రేపారు.ఇక‌, అదే స‌మ‌యంలో జ‌న‌సేనానిని త‌మ్ముడు అని పిలుస్తూనే సెటైర్ల‌తో రెచ్చిపోయారు. వ‌చ్చెయ్‌.. త‌మ్ముడూ.. మ‌నం క‌లిసి పోటీ చేద్దాం. నిన్ను గెలిపించే బాధ్య‌త నేను తీసుకుంటాను. 30 సీట్లు నీకు ఇస్తాను! అంటూ.. కామెంట్లు కుమ్మ‌రించారు. స‌రే! ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేసిన న‌ర‌సాపురం ఎంపీ స్థానంలో కేవ‌లం 30 ఓట్ల‌ను మాత్ర‌మే వేయించుకోగ‌లిగిన పాల్‌.. రాజ‌కీయాల్లో ఓ కామెడీ కింగ్‌(ఆయ‌న‌కు కోపం వ‌చ్చినా.. వాస్త‌వం ఇదేన‌ని అంటున్నారు) అని పేరు తెచ్చుకున్నారు. మ‌రి ఇప్పుడు ఆయ‌న  విదేశాలకువెళ్లారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా ఉంటే కేఏ పాల్ వస్తే తప్ప పరిస్థితి చల్లబడదన్న సెటైర్లు సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి.

Related Posts