YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

సింగరేణి సోలార్ ప్లాంట్స్

 సింగరేణి  సోలార్ ప్లాంట్స్

ఖమ్మం, సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ అవసరాలకు ఉపయోగపడే విధంగా రాష్ట్రంలోని తొమ్మిది ప్రాంతాల్లో రూ.1,360కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు సింగరేణి యాజమాన్యం కార్యచరణ సిద్ధం చేస్తోంది. మొదటి దశలో తొమ్మిది చోట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటుచేసి 300 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. కొత్తగూడెం, ల్లెందు, మందమర్రి, రామగుండం, మణుగూరు, బెల్లంపల్లి, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో సాధారణంగా 30-38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. వేసవి కాలంలో 45-48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఒకసారి వ్యయం చేస్తే కొన్నేళ్లపాటు మెయింటనెన్స్ చేయాల్సిన అవసరం ఉండదని సింగరేణి భావిస్తోంది. తక్కువ మ్యాన్ పవర్‌తో విద్యుత్ ఉత్పత్తికి వీలు కలుగుతుంది. వివిధ రకాల సామర్ధ్యాలను ఆధారంగా చేసుకొని ఇల్లెందులో 60 మెగావాట్స్, మందమర్రిలో 60 మెగావాట్స్, రామగుండం-1లో 50 మెగావాట్స్, రామగుండం-2లో 25 మెగావాట్స్, మణుగూరులో 30 మెగావాట్స్, బెల్లంపల్లిలో 30 మెగావాట్స్, కొత్తగూడెంలో 25 మెగావాట్స్, భూపాలపల్లిలో 10 మెగావాట్స్, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్స్, 10 మెగావాట్స్ ప్లాంటులను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సింగ రేణి సంస్థ థర్మల్ విద్యుత్‌ను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి చేస్తుంది. సోలార్ ప్లాంట్ ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థ ‘‘సౌత్ ఈస్టర్న్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా’’ తో సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ బోర్డు చర్చలు జరిపింది.సింగరేణి సంస్థ థర్మల్ విద్యుత్‌తో పాటు సోలార్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు అనుమతి పొందింది. అయితే ఫండింగ్ విషయంలో నిర్ణయానికి రానుంది. సోలార్ ప్లాంట్స్ నిర్మాణం విషయంలో ప్రభుత్వ సోలార్ విభాగంతో చర్చించాం. ముందుగా ఫ్రీ బిల్డింగ్, టెండర్స్, టెక్నికల్ సోర్సు తదితర వాటిని పూర్తిచేయాలని భావిస్తున్నాం. వచ్చే 12 నెలల్లో సోలార్ ప్లాంట్స్ పూర్తిచేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సింగరేణి బొగ్గు గనులు ఉన్న తొమ్మిది ప్రాంతాల్లో ఈ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నారు

Related Posts