YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఐటీ ఉద్యోగులకు కొత్త టెన్షన్

ఐటీ ఉద్యోగులకు కొత్త టెన్షన్

హైద్రాబాద్, నగరంలోని పలు ఐటీ కంపెనీల్లో ప్రస్తుతం 6 లక్షల మంది పనిచేస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో కొత్త కంపెనీలు వస్తున్నాయి. విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఐటీ ఎగుమతుల్లో దూసుకుపోతున్నామని ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేస్తున్నారు కానీ కంపెనీల ఆగడాలను కట్టడి చేయడం లేదు. పెట్టుబడులు తీసుకువచ్చే క్రమంలో మితిమీరిన మినహాయింపులు, చట్టాల్లో సడలింపులతో వేధింపులు పెరిగాయని ఉద్యోగులు వాపోతున్నారు. అద్భుత అవకాశంగా భావించే సాఫ్ట్వేర్ జాబ్ ప్రస్తుతం కష్టాలపాలు చేస్తోంది. ప్రతి కంపెనీలో ఏదోఒక విధంగా టెక్కీల ఉద్యోగాలు ఊడుతున్నాయి. టెర్మినేషన్ లేదా బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఫ్యూచర్పై దెబ్బకొడతామంటూ కొన్ని పలు కంపెనీలు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా బలవంతంగా రిజైన్లు చేయిస్తున్నాయి. ఏడాది కాలంగా దాదాపు వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించిన కంపెనీలు పదుల సంఖ్యలో ఉంటాయని ఐటీరంగ నిపుణులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఉద్యోగులను తొలగించాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. లేబర్ డిపార్ట్మెంట్ని సంప్రదించి ఉద్యోగులకు ముందస్తు నోటీసులు జారీ చేయాలి. దాదాపు 3 నుంచి 6 నెలల జీతాన్ని చెల్లిస్తున్నట్టు హామీ ఇవ్వాలి. ఇలాంటి అదనపు భారాన్ని భరించలేక కంపెనీలన్నీ గుట్టుచప్పుడు కాకుండా తొలగిస్తున్నాయిచాలా కంపెనీలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6  గంటల దాకా పనిచేయిస్తున్నాయి. మళ్లీ ఇంటికి బయలుదేరే లోపే మెయిల్ పంపించి సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 11 దాకా  వర్క్ టు హోం చేయిస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిమితికి మించిన పనిగంటలు, ఓవర్ నైట్ డ్యూటీలు చేయాలని పలు కంపెనీలు కండిషన్ పెడుతున్నాయని చెబుతున్నారు. ఇల్లీగల్ లే ఆఫ్, ఫోర్సుడ్ రిజిగ్నేషన్లను పట్టించుకునే యంత్రాంగం లేదు. షాప్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్టు, ఇండస్ట్రీయల్ డిస్ఫ్యూట్ యాక్టు వంటివి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగానికి మినహాయింపులిచ్చింది. పెట్టుబడులు తీసుకువచ్చే క్రమంలో తొలుత కంపెనీలను ప్రోత్సహించిన చట్టాలు ఇప్పుడు ఉద్యోగుల పాలిట శాపంగా మారుతున్నాయి.ఐటీ కంపెనీల్లో కష్టాలు, వేధింపులు, పని ఒత్తిళ్లను భరించలేక ఈమధ్యనే కొందరు హైర్టు కెళ్లారు. వీరిలో ప్రముఖ ఐటీ కంపెనీలకు చెందిన ఉద్యోగులే ఎక్కువ ఉన్నారు. ఎక్కువ పని గంటలు చేయించినా ప్రోత్సాహకాలు ప్రకటించకపోవడం, లీవ్ పాలసీ విధానంలో మార్పులు చేస్తున్నారని పిల్ దాఖలు చేశారు.

Related Posts