శ్రీశైలం , ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ఉన్నా భ్రమరాంబ దేవి వారికి నిలయమైన శ్రీశైల మహా క్షేత్రం భూమండలానికి నాభిస్థానం అని పురాణాలు
చెబుతున్నాయి .రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు శ్రీశైలం దేవస్థానం లో ఈవో రామా రావు ఆధ్వర్యంlలోవిస్తృతంగా ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపట్టారు ఇందులో భాగంగా హిందూ ధర్మ ప్రచార కార్యక్రమ నిర్వహణలో భాగంగా శ్రీశైలం దేవస్థానం మా స్వామి మల్లన్న అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దోర్నాల నుండి శ్రీశైలం మార్గం మధ్యలో నివసిస్తున్న గిరిజనులకు గూడెం అయినటువంటి చింతల లో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేవస్థానం అధికారుల సమన్వయ బృందం చింతల లో పర్యటించి కార్యక్రమం గురించి భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు .ముందుగా చింతల చెంచు గూడెంలో మల్లన్న ధర్మ ప్రచారం తో శోభాయాత్ర నిర్వహించారు ప్రధానంగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పూజాదికాలు నిర్వహించారు పూజాదికాలు తర్వాత భజన బృందం వారిచే శివ భజనలు నామ సంకీర్తనలు చేశారు ఈ భజన లో చెంచు భక్తులు కూడా భాగస్వామ్యం అయ్యారు అనంతరం ఈవో రామారావు ఒక్కో ఇంటికి శ్రీస్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని మెడలో ధరించేందుకు రుద్రాక్షమాలను ,ఉండిలో కానుకలు రూపేనా వచ్చిన వస్త్రాలను భక్తులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏసీ కోదండరాం రెడ్డి దేవస్థానం అర్చకులు వేదపండితులు అధికారులు సిబ్బంది స్థానికులు భక్తులు పాల్గొన్నారు