హైదరాబాద్, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు అబ్రహం ఇటీవలే పబ్లిక్ అండర్ టేకింగ్ సభ్యులుగా నియమితులు అయ్యారు. ఈ సందర్బంగా ఆర్డీఎస్ మాజీ చైర్మన్, తనగల సీతారామిరెడ్డి, వడ్డేపల్లి, రాజోలి మండలాల ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు ఆయనను కలసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఘనంగా సన్మానం చేసి పూల మొక్కను బహుకరించారు. ఈ
సందర్బంగా వారు మాట్లాడుతూ మృదు స్వభావి, జనం మెచ్చిన నాయకుడు అలంపూర్ ఎమ్మెల్యేను గుర్తించి నియమించారు. దానికి నుముఖ్య మంత్రి కేసీఆర్ కు ప్రతేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పచ్చర్ల శ్రీనివాసులు, తిరుమలరెడ్డి, తనగల వెంకటయ్య, జంగం వీరేష్, జడ్పీటీసీలు, ఎంపీనీలు, ఎంపీటీసీలు సర్పంచులు పాల్గొన్నారు.